Sunday, September 8, 2024
spot_img

పీలో తెలంగాణ – పిలావో తెలంగాణ ఇదే కేసీఆర్ స్లోగన్

తప్పక చదవండి
  • ‘ఖేలో ఇండియా.. జీతో భారత్’ నినాదం బీజేపీది
  • మద్యాన్ని ఏరులై పారించి ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న కేసీఆర్
  • మళ్లీ అధికారంలోకి వస్తే స్విగ్గీ, జొమాటో ద్వారా ఇంటింటికీ మద్యాన్ని పారిస్తారేమో
  • మరో 5 నెలలు ఆగండి.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ సర్కార్ నే నిషేధించబోతున్నారు
  • తెలంగాణ సబ్బండ వర్గాలు అల్లాడుతుంటే.. వందల కోట్లతో సొంత డబ్బా కొట్టుకుంటారా?
  • కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్..

హైదరాబాద్ : ‘ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నంచే మీడియాను కేసీఆర్ ప్రభుత్వం నిషేధిస్తోంది. ఉద్యమించే నాయకులను అరెస్ట్ చేసి బెదిరిస్తోంది. మరో 5 నెలలు ఆగండి… తెలంగాణ ప్రజలే కేసీఆర్ సర్కార్ ను నిషేధించబోతున్నారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు… తెలంగాణ సబ్బండ వర్గాలు అల్లాడుతుంటే… వందల కోట్ల ప్రజా ధనంతో సొంత పార్టీ డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. చివరకు బీజేపీ ఎదుగుతుంటే ఓర్వలేక తమ పార్టీ వార్తలు రాయొద్దంటూ ప్యాకేజీలు ఇచ్చే దుస్థితికి కేసీఆర్ చేరుకున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ కు దమ్ముంటే… తన పాలనలో తెలంగాణలో చేసిన అభివ్రుద్ధిపై శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం రోజు హైదరాబాద్ లోని నిజాం కాలేజీ మైదానంలో ‘‘ఖేలో భారత్- జీతో భాగ్యనగర్’’ పేరిట నిర్వహించిన క్రీడల పోటీల ఫైనల్ మ్యాచ్ ను తిలకించడానికి వచ్చిన బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే.. సీఎం కేసీఆర్ స్విగ్గీ, జోమాటో ద్వారా ఇంటింటికి మద్యం సరఫరా చేస్తారని ఆక్షేపించారు. ఈ ప్రభుత్వం మద్యం ద్వారా వచ్చే ఆదాయం ద్వారానే పాలన సాగిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం ద్వారానే దాదాపు రూ. 40 వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యనించారు. తెలంగాణలోని సబ్బండ వర్గాలు అల్లాడుతుంటే.. వందల కోట్ల ప్రజా ధనంతో సొంత పార్టీ డబ్బా కొట్టుకుంటున్నారని సంజయ్ మండిపడ్డారు. త్వరలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలే నిషేదిస్తారని.., ఆ పార్టీని గద్దె దించటం ఖాయమని అన్నారు.

- Advertisement -

తెలంగాణలోని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న సీఎం కేసీఆర్.. పక్క రాష్ట్రంలో ఉన్న వారికి మాత్రం లక్షలకు లక్షల ప్యాకేజీ ఇచ్చి ఉద్యోగాల్లో నియమించుకుంటున్నారని అన్నారు. ఇక్కడి రైతులను ఆదుకోవాల్సిందిపోయి ఎక్కడో పంజాబ్‌లో ఉన్న రైతులకు చెక్కులు పంచారని దుయ్యబట్టారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌ను సీఎం ప్రత్యేక అడ్వైజర్‌గా నియమించటంపైనా బండి సంజయ్ ఫైరయ్యారు. హైకోర్టు తిడితే ఏపీకి పారిపోయిన వ్యక్తిని ప్టటుకొచ్చి చీఫ్ అడ్వయిజర్ పోస్టు ఇచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రాభివృద్ధిపై కేసీఆర్ అసత్యాలు చెబుతున్నారని.. నిజంగా అభివృద్ధి చేసి ఉంటే శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీలో ఏదో జరుతోందని తప్పుడు ప్రచారం తెరపైకి వచ్చిందన్న బండి సంజయ్.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీ పెద్దలను కలవటానికి వెళితే తప్పేంటని ప్రశించారు. బీజేపీ అగ్రనేతలను ఎవరైనా.. ఎప్పుడైనా కలవొచ్చునని అన్నారు. బీజేపీలో అంతా బాగానే ఉందని ఉహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలన్నారు. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాలకు, తెలంగాణ ఎన్నికలకు సంబంధమే ఉండదని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే.. దేశమంతటా గెలిచినట్లు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బలంగా ఉంటే.. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడులో ఆ పార్టీకి డిపాజిట్ ఎందుకు రాలేదని సంజయ్ ప్రశ్నించారు. కేంద్రంతో పాటు.. 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు

ఎమ్మెల్యే రాజసింగ్ ధర్మ రక్షకుడని ఆయన సస్పెన్షన్ విషయంలో త్వరలో మంచి నిర్ణయం వస్తుందని అన్నారు. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేయాలని ఇప్పటికే హైకమాండ్‌కు అప్పీల్ చేశామని చెప్పారు. త్వరలోనే హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు సంజయ్ వెల్లడించారు. మీడియాకు నా విజ్ఝప్తి… వందల కోట్ల యాడ్స్ ఇస్తున్నారని ప్రభుత్వానికి బాకా కొడితే సామాన్య ప్రజలేమైపోయారు. ఒక పార్టీకి సంబంధించి వార్తలు రాయడం తప్పు లేదు.. కానీ బీజేపీ కార్యక్రమాలు వార్తలు రావొద్దని ప్యాకేజీలు ఇచ్చే దుస్థితికి కేసీఆర్ చేరిండు.. అయినా ప్రశ్నిస్తే ఆ పత్రికలను నిషేధిస్తున్నడు… ఇంకో 5 నెలలు ఆగండి… కేసీఆర్ ప్రభుత్వాన్నే ప్రజలు నిషేధించబోతున్నరు.

కేసీఆర్ కు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే చెప్పాలి…. ఏ శాఖ ఏ రకమైన అభివ్రుద్ధి చేసిందో వివరాలతో సహా శ్వేత పత్రం విడుదల చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దళిత బంధు పేరుతో 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని కేసీఆరే చెప్పిండు.. మళ్లీ దళిత బంధు గొప్పదని పత్రికల నిండా ప్రచారం చేసుకుంటున్నరు. దళిత బంధు పేరుతో ఒక మహిళా లబ్దిదారురాలికి రూ.లక్ష మాత్రమే ఇచ్చి రూ.9 లక్షలు ఎమ్మెల్యే తీసుకున్నడు… అవినీతిలో కేసీఆర్ కుటుంబంతో పోటీ పడబోతున్నారు. దమ్ముంటే కేసీఆర్ సాధించిన అభివ్రుద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు