Friday, March 29, 2024

పట్టాలెక్కిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌

తప్పక చదవండి
  • ప్రమాదం జరిగిన 5 రోజుల తర్వాత షాలిమార్‌ నుండి
  • నిర్ణీత సమయానికి 5 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరిన కోరమాండల్‌
  • 51 గంటల్లోనే రెండు ప్రధాన రైల్వే మార్గాల పునరుద్ధరణ

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బుధవారం నుంచి పునఃప్రారంభం అయింది. కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ జూన్‌ 2వ తేదీన బాలాసోర్‌లోని బహనాగా రైల్వే స్టేషన్‌ వద్ద గూడ్స్‌ రైలును ఢీకొన్న ఘటనలో 288 మంది మరణించగా, 1000మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన 5 రోజుల తర్వాత కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బుధవారం నుంచి తన సేవలను పునఃప్రారంభించింది. ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే రెండు ప్రధాన మార్గాలను రైల్వే సిబ్బంది అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఇతర రైళ్లు ప్రమాదం జరిగిన మూడో రోజునే ఆ ట్రాక్‌ పైన ప్రయాణించాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు