Friday, April 26, 2024

తాత్కాలిక బ్రేక్‌

తప్పక చదవండి
  • జూన్‌ 15 వరకు బ్రిజ్‌ భూషణ్‌ పై చర్యలకు గడువు
  • అనురాగ్‌ ఠాకూర్‌ తో 6 గంటల పాటు రెజ్లర్ల చర్చ
  • కేంద్రం ముందు 5 డిమాండ్లు ఉంచిన రెజ్లర్లు
  • డబ్ల్యూఎఫ్‌ఐలో ఇంటర్నల్‌ కంప్లైంట్స్‌ కమిటీ ఉందన్న అనురాగ్‌ ఠాకూర్‌

భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఒకానొక దశలో వీరంతా మెడల్స్‌ను గంగానదిలో కలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించి.. రెజ్లర్లతో సమావేశమైనప్పటికీ చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. తాజాగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో రెజ్లర్లు బజరంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు కేంద్ర మంత్రి ముందు 5 డిమాండ్లు వుంచినట్లుగా సమాచారం. అయితే దాదాపు 6గంటల పాటు జరిగిన చర్చల్లో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లిఖితపూర్వంగా పలు హామీలు ఇచ్చినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం రెజ్లింగ్‌ క్రీడాకారుడు భజరంగ్‌ పునియా మీడియాతో మాట్లాడారు. పలు అంశాలపై కేంద్రమంత్రితో చర్చించినట్టు చెప్పారు. బ్రిజ్‌ భూషణ్‌పై ఢల్లీి పోలీసుల దర్యాప్తు ఈ నెల 15నాటికి పూర్తవుతుందని.. అప్పటివరకు రెజ్లర్లు నిరసనలు చేయొద్దని కేంద్రమంత్రి తమకు సూచించారన్నారు. నమోదు చేసిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేయగా.. అందుకు మంత్రి అంగీకరించారని మహిళా రెజ్లర్ల భద్రతను కూడా చూసుకుంటామని చెప్పారన్నారు. మే 28న ఆందోళనల్లో భాగంగా రెజ్లర్లపై తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్‌ 15 వరకు తమ నిరసనలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు భజరంగ్‌ పునియా వెల్లడిరచారు. 15 తర్వాత ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమ పోరాటం మాత్రం ముగిసిపోలేదన్నారు.

రెజ్లర్లు కేంద్రం ముందు పెట్టిన డిమాండ్లు :
డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ పదవిలో మహిళను నియమించాలి
బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్ట్‌ చేయాలి
బ్రిజ్‌భూషణ్‌ కుటుంబ సభ్యులెవరూ రెజ్లింగ్‌ సమాఖ్యలో భాగం కారాదు.
పాలక మండలికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి
ఇటీవల ఢల్లీిలో ఆందోళన సందర్భంగా తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలి

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు