Wednesday, October 16, 2024
spot_img

ఆన్లైన్‌ మోసాలు… జాగ్రత్తగా ఉండండి..

తప్పక చదవండి

ఎప్పుడైతే బ్యాంకింగ్‌ రంగం డిజిటిలీకరణ జరిగిందో ఖాతాదారులు నగదు లావీదేవీలు ఇంటినుండే జరుపుతున్నారు.ఇవన్నీ తక్కువ కాలం లోనే జరగడం వలన ఎక్కువ ఖాతాదారులు ఆన్లైన్లో నగదు కార్యకలాపాలు చెయ్యడం అలవాటు చేసుకున్నారు. ఇక కోవిడ్‌ పరిస్థితులలో చాలా మంది ఆన్లైన్‌ వైపే మొగ్గుచూపారు. ఇదే అదనుగా చాలా మంది మోసగాళ్ళు ఖాతాదారులను మోసం చేసి మన నగదును మనకు తెలియకుండా కాజేస్తున్నారు.ఒక వ్యక్తి బ్యాంకు ఖాతా నుండి ఇంటర్నెట్‌ మాధ్యమం ద్వారా డబ్బులు దొంగలించడాన్నే ఆన్లైన్‌ మోసం అని చెప్పొచ్చు.మోసగాల్లు రకరకాల పద్దతులను అనుసరించి డబ్బులను కాజేస్తరు.నకిలీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యు.పి.ఐ ల ద్వారా ప్రధానంగా మోసాలు జరుగుతున్నాయి.ఎ. టి.యం. యంత్రాలలో కీ పాడ్‌ కనిపించేలా చిన్న రహస్య కెమెరాను అమర్చి ద్వారా మనం పిన్‌ ను నమోదు చేసేటప్పుడు పసిగట్టి స్కిమ్మింగ్‌ పద్దతిలో నకిలీ ఎ. టి.యం కార్డులను తయారు చేసి ఖాతా నుండి నగదును తియ్యడమూ లేదా ఆన్లైన్‌ లేదా ఆఫ్లైన్‌ ద్వారా షాపింగ్‌ చేసుకుంటారు.బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసిన ఫోన్‌ నంబర్‌ యొక్క సిమ్‌ ని స్వాపింగ్‌ లేదా క్లోనింగ్‌ చేసి నకిలీ సిమ్‌ ని పొంది ఓ.టి.పి లు వచ్చేటట్లు చేసుకొని ఖాతా లోని నగదును కొల్లగొడతారు.ఫిషింగ్‌ అంటే బ్యాంక్‌ లేదా ఈ – కామర్స్‌ సైటులను పోలిన వెబ్సైటులను రూపొందించి వీటిని వినియోగించేటప్పుడు వాటి ద్వారా ఖాతాదారుని వివరాలు తెలుసుకొని మోసానికి పాల్పడతారు.విషింగ్‌ పద్దతి ఉపయోగించి ఇంకా బ్యాంకుల నుండి అధికారుల మాదిరిగా ఫోన్‌ చేసి కార్డ్‌ బ్లాక్‌ అయిందనో, ఇ-కె.వై.సి చేయ్యాలనో, ఖాతా బ్లాక్‌ అయిందనో వినియోగదారుల కార్డుల వివరాలు , పిన్‌ నెంబరులను తెలుసుకొని ఒ.టి.పి ల ద్వారా ఖాతాలోని నగదును ఖాళీ చేస్తారు.ఇప్పుడు అందరూ ఎక్కవగా రకరకాల యు.పి.ఐ ల ద్వారా బ్యాంకు లావేదేవీలు చేస్తున్నారు. మోసగాళ్ళు దొంగ క్యు.ఆర్‌ లను ఫోన్లకు పంపించి దాని ద్వారా అకౌంట్‌ లోని డబ్బులను తీస్తున్నారు. మన ఖాతాకు ఎంతో కొంత నగదును పంపించి, పొరపాటుగా వచ్చేసిందని, ఆ నగదును యు.పి. ఐ ద్వారా తిరిగి పంపమని ప్రాధేయపడతారు.ఇది నిజమే అనుకొని వారి ఖాతాకు నగదును తిరిగి పంపుతారు.ఇదే అదనుగా మోసగాళ్ళు వారి పని వారు కానిస్తారు.అలాగే కొన్ని సంస్థలు లేదా టోల్‌ ఫ్రీ నంబరును తెలుసుకోడానికి ఆన్లైన్లో శోధిస్థారు. మోసగాళ్ళు ముందు గానే మనం వెతుకుతున్న నంబర్లకు బదులుగా నకిలీ ఫోన్‌ నంబర్లను ఉంచుతారు. వినియోగదారుడు ఆ నంబర్‌ యధర్థమైనదేనని నమ్మి కాల్‌ చేస్తే తనదైన శైలిలో మోసగాళ్ళు నగదును మాయం చేసేస్తారు.ప్రతీ ఒక్కరూ ఇప్పుడు ఫేస్బుక్‌ ,ఇన్స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలు వాడుతున్నారు. ఇదే అదనుగా మన స్నేహితుడు మాదిరిగానే అత్యంత అవసరం ఉందని కొంత మొత్తాన్ని అప్పు కావాలని నమ్మ బలుకుతారు. మనం నమ్మి ఆన్లైన్లో నగదును పంపిస్తే ఇక అంతే. ఇంకా వ్యక్తి గత ఫోటోలను అసభ్యకరంగా మార్పులు చేసి బెదిరించి డబ్బులు గుంజుతున్నారు.కొంత మంది యువత అసభ్యకరమైన వెబ్సైట్లును చూస్తారు. అప్పుడు ఆ వెబ్సైటు నుండి కొన్ని రకాల మాల్వేర్లను వారి వ్యక్తిగత మొబైల్‌ లేదా కంప్యూటర్‌ చొప్పిస్తారు. అది ఇక అక్కడే తిష్ట వేసి వ్యకిగత సమాచారాన్ని లేదా ఆన్లైన్లో బ్యాంకింగ్‌ చేసేటప్పుడు సమాచారాన్ని మోసగాళ్లకు చేరవేస్తుంది. వారు ఆన్లైన్‌ బ్యాంకింగ్‌ వివరాలు దొంగలించి నగదును కాజేస్తారు.తక్కువ రేటుకే కొన్ని రకాలైన వస్తువులు విక్రయిస్తామని మన ఫోన్లకు యస్‌.యమ్‌.యస్‌ లేదా ఈ మెయులుకు లింక్‌ లను పంపుతారు. అది క్లిక్‌ చెయ్యగానే మన అకౌంట్లో డబ్బులు తీసేసుకుంటారు.గేమ్స్‌, అశ్లీల యాప్‌ లను లింకుల ద్వారా డౌన్లోడ్‌ చేసేటప్పుడు మన బ్యాంకింగ్‌ వివరాలను తస్కరించి ఖాతాలను ఖాళీ చేస్తారు.ఇక లాటరీ వచ్చిందని, రీఛార్జ్‌ ఉచితమని, పెట్రోల్‌ ఉచితమని రకరకాలైన సందేశాన్ని పంపించి అవి క్లిక్‌ చెయ్యగానే వారి పని వారు చేస్తారు. ఇక మనకు మిగిలింది జీరో అకౌంట్‌ మాత్రమే..!
పరిష్కారాలు.. ముందుగానే ఖాతాదారులుబ్‌ అవగాహన కలిగి ఉండాలి. ఎ. టి.యం లలో నగదు తీసేటప్పుడు రహస్య పిన్‌ ను ఎవరికీ కనిపించకుండా కీ బోర్డ్‌ పై ఒత్తాలి. శివారు ప్రాంతాల్లో ఉన్న కేంద్రాల నుండి కాక జనావాసాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఎ టి యం ల నుండి నగదును తీసుకోవాలి. అనుమానితులు ఉండే అక్కడ నగదు తీయకూడదు.ఏ ఒక్క బ్యాంకు అధికారి కాల్‌ చేసి ఖాతాకు సంబందించిన వివరాలు అడిగారు. అలాగే మనకు వచ్చే ఒ.టి.పి లు ఎవరితో చెప్పకూడదు. ఆన్లైన్‌ లో లావిదేవీలు చేసేటప్పుడు బ్యాంకుకి సంబంధించిన వెబ్సైట్‌ మాత్రమే ఉపయోగించాలి. ఆన్లైన్లో ఫోన్‌ నంబర్లను నమ్మగూడదు. అనుమానిత లింక్లను తెరవగూడదు. యు.పి. ఐ లతో జాగ్రత్తగా లావేదేవీలు చెయ్యాలి.సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారాన్ని, ఫోటోలను ఉంచగూడదు. అసభ్యకరమైన సైట్‌ లను తెరువగూడదు. ఉచితాలని, లాటరీలని నమ్మగూడదు. ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు ఫోన్‌ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మొబైల్‌ ని లాక్‌ చేసుకోవాలి.ఇక ఏదైనా అక్రమ లావేదేవీలు జరిగితే వెంటనే బ్యాంకునకు ఫోన్‌ చేసి తెలపాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1930 నంబరుకి కాల్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పి కంప్లైంట్‌ ఇవ్వాలి.
` డి జె మోహన రావు 9440485824

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు