Saturday, July 27, 2024

అండర్ ట్రైనింగ్ ఐపీఎస్ లకోసం ఒక రోజు వర్క్ షాప్..

తప్పక చదవండి
  • డీజీపీ అంజనీ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం..

తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన అండర్‌ ట్రైనింగ్‌ ఐపీఎస్‌ అధికారుల కోసం డీజీపీ అంజనీకుమార్‌, ఐపీఎస్‌ ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. హైదరాబాద్ లక్డీకాపూల్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఈ వర్క్ షాప్ జరిగింది. ఈ వర్క్‌షాప్‌కు పలువురు సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు..

సహా. శిఖా గోయెల్, ఏడీజీ ఉమెన్ సేఫ్టీ వింగ్, ఏడీజీ ఆపరేషన్స్ విజయ్ కుమార్, అభిలాష బిష్త్, ఏడీజీ కోఆర్డినేషన్, షానవాజ్ ఖాసిం, ఐజీపీ మల్టీ జోన్-2, డాక్టర్ తరుణ్ జోషి, ఐజీపీ శిక్షణ, ఎం. రమేష్, ఐజీపీ, పీ అండ్ ఎల్, సంప్రీత్ సింగ్, ఏ.ఐ.జీ. ఎల్ అండ్ ఓ.. లతో పాటు డిప్యూటీ డైరెక్టర్ టి.ఎస్.పీ.ఏ. , డాక్టర్ బి. నవీన్ కుమార్ లు పాల్గొన్నారు.

- Advertisement -

74 ఆర్.ఆర్. (2021 బ్యాచ్)కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీలు తమ శిక్షణను మార్చి 28, 2022న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ప్రారంభించారు.. ఫిబ్రవరి 10, 2023న పూర్తి చేశారు. తర్వాత, వారు పార్లమెంట్‌కు కేటాయించబడ్డారు, ఢిల్లీలోని సి.ఏ.పీ.ఎఫ్. లు / సి.పీ.ఓ.లు, వారి కేడర్ / రాష్ట్రానికి (తెలంగాణ) మార్చి 5 2023న 29వారాల జిల్లా ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం నియమించబడ్డారు..

ప్రస్తుతం, ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీలు వారి శిక్షణలో మూడవ దశలో ఉన్నారు.. ఇక్కడ వారికి పోలీసు స్టేషన్ల స్వతంత్ర బాధ్యతలు అప్పగించబడ్డాయి. అధికారులు, వారి సంబంధిత అసైన్‌మెంట్‌ల వివరాలు ఇలా ఉన్నాయి :

అంకిత్ కుమార్ సంఖ్వార్ (ఉత్తరప్రదేశ్) వరంగల్ కమిషనరేట్‌కు అనుబంధంగా ఉన్నారు.. ప్రస్తుతం ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కుమార్ (బీహార్) ఖమ్మం కమిషనరేట్‌కు అనుబంధంగా ఉన్నారు.. ప్రస్తుతం మదిర టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గీతే మహేష్ బాబాసాహెబ్ (మహారాష్ట్ర) కరీంనగర్ కమిషనరేట్‌కు అనుబంధంగా ఉన్నారు.. ప్రస్తుతం చొప్పదండి పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శేషాద్రి రెడ్డి సూరుకొంటి (తెలంగాణ) నల్గొండలోని జిల్లా పోలీసు కార్యాలయానికి అనుబంధంగా ఉన్నారు.. ప్రస్తుతం కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శివం ఉపాధ్యాయ (ఉత్తరప్రదేశ్) రాచకొండ కమిషనరేట్‌కు అనుబంధంగా ఉన్నారు.. ప్రస్తుతం బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు