Thursday, September 12, 2024
spot_img

మావోయిస్టుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు అరెస్ట్..

తప్పక చదవండి
  • వివరాలు తెలిపిన పోలీసు అధికారులు..
    మావోయిస్టుల పేరుతో నగదు వసూలు చేస్తున్న నలుగురిని చర్ల పోలీసులు అరెస్టు చేశారు. చర్ల సీఐ బి.అశోక్, ఎస్సైలు టీవీఆర్ సూరి, టి. వెంకటప్పయ్యలు మీడియాకి వివరాలు తెలిపారు. చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన శ్యామల రామకృష్ణ (31), చిన్నమిడిసిలేరుకి చెందిన శ్యామల జలేందర్ (23), శ్యామల నవీన్ (21), సి. కొత్తూరుకి చెందిన తెల్లం సంతోష్ (22) అనువారు మావోయిస్టుల పేరు చెబుతూ నకిలీ తుపాకితో వ్యాపారులను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తుండగా పట్టుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి రూ 2370 నగదును, నకిలీ తుపాకి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదుచేసినట్లు తెలిపారు. ఇలాంటి వ్యక్తుల బెదిరింపులకు భయపడి వ్యాపారులు డబ్బులు ఇవ్వరాదని, ఇలాంటి వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు…
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు