- హైదరాబాద్ కేంద్రంగా కసరత్తులు
- కాచి వడపోస్తున్న అధికారులు
- ‘కాగ్’ అడిగిన అవినీతికి ధీటైన సమాధానాలు రెడీ
- మరో రెండు రోజులు కొనసాగనున్న లెక్కలు
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, ‘ఆదాబ్ హైదరాబాద్’కు ప్రత్యేకం)
కాళేశ్వరం ప్రోజెక్టుకు సంబంధించిన ఆడిట్ అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధవారం నుంచి సంబంధిత అధికారులు మొదలెట్టారు. గతంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) కాళేశ్వరం ప్రోజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాల గురించి అనేక ప్రశ్నలను తెలంగాణ రాష్ట్రానికి పంపింది. దీనికి ధీటుగా సమాధానం చెప్పటం కోసం సంబంధిత అధికారులు కసరత్తులు మొదలెట్టారు. గుట్టుగా జరుగుతున్న ఈ’ ఆడిట్ రిప్లై’పై ‘ఆదాబ్.హైదరాబాద్’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ప్రధాన ఆరోపణలు ఇవే:
కాగ్ అధికారుల దృష్టిలో అనేక అరోపణలు ఉన్నప్పటికీ.. నిధుల దుర్వినియోగంపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాగ్ పేర్కొన్న అంశాలలో ముఖ్యమైనవి.
లాభం ఎవరికి.?:
డిజైన్లు మార్చడానికి గల కారణాలు, అందుకు అయిన అదనపు వ్యయం, కాంట్రాక్టర్ పాత్ర గురించి, వారికి అదనంగా ఎంత వరకు లాభించింది.
అంచనాలు అంతగా పెరగటానికి..:
ప్రాజెక్ట్ వ్యయం రూ. 40,000 కోట్ల నుండి లక్ష కోట్లకు పైగా పెరిగింది. ఇందులో ఎవరి పాత్ర ఎంత.?
దారిమళ్ళిన నిధులు..:
జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం రూ. గత నాలుగేళ్లలో 3982 కోట్లు ఇచ్చింది. పీఎంకేఎస్‌వై, ఏఐబీపీ, సీఏడబ్ల్యూఎం పథకాల కింద కేంద్రం రూ. 1195 కోట్లు ఇచ్చింది. పేర్కొన్న ఆయన ఇతర కేంద్ర నిధులతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ. 1,15,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎందుకు ప్రభుత్వం దారి మళ్లించింది.
ఎందుకీ అప్పగింత:
ఫాస్ట్‌ట్రాక్ విధానంలో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు అప్పగించటం గురించి.
105 మిషన్ల గురించి..:
కాళేశ్వరం ప్రాజెక్టులో 120 మిషన్లకు బదులు 105 మిషన్లు అమర్చి 20 పంప్ హౌస్ లకు బదులు 17 పంప్ హౌస్ లు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. కన్నెపల్లి పంప్ హౌస్ లోకి వరద నీరు వచ్చి 17 బాహుబలి మోటార్లు నీటిలో మునిగిపోయినట్లు అధికారులు గుర్తించారు.