Monday, September 9, 2024
spot_img

హుడా భూములపై..కన్నేసిన బీ.ఆర్‌.ఎస్‌. నేతలు

తప్పక చదవండి
  • మంత్రి మల్లారెడ్డి ఇలాకాలో
    హూడా భూమి మాయం ..
  • సర్వే నెంబర్స్‌ 182, 183 రెవెన్యూ పరిధి
    కాదని చేతులు ఎత్తేసిన వైనం..
  • హెచ్‌ఎండిఏ భూములను కబ్జాదారుల
    చేతుల్లో నుంచి కాపాడేది ఎవరు..?
  • అక్రమ నిర్మాణం జరిగి వారం గడుస్తున్నా
    అటువైపు కన్నెత్తి చూడని అధికారులు..
  • 17వ డివిజన్‌ కార్పొరేటర్‌ కనుసన్నల్లో
    హూడా భూమి మాయం..
  • సర్వే నెంబర్స్‌ 182, 183 లోని భూమిని
    ప్రజా ప్రయోజనాలకు కేటాయించాలి..
    జవహర్‌ నగర్‌ : జవహర్‌ నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని17 డివిజన్‌లో గల సర్వే నెంబర్‌ 182, 183 సర్వే నెంబర్స్‌లోని ప్రభుత్వ భూములను కొద్ది మంది భూ కబ్జాదారులు లే అవుట్లు చేసి పట్టణంలో ఇళ్ళు వుం డాలి..సొంతింటి కల నెరవేర్చుకుందాం అనుకునే పేద ప్రజ లను ఆసరాగా చేసుకొని..హూడా భూములను విక్రయించడమే కాకుం డా.. ఇందులో అక్రమ నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ భూము లను కబ్జాకు గురి చేస్తున్న వైనం జవహార్‌ నగర్‌ లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇదిలా ఉంటే హుడా భూముల కబ్జాలకు సహ కరిస్తు న్నట్లుగానే హుడా అధికారులు 182, సర్వే నెంబర్‌ లో అక్రమ నిర్మాణం జరిగి వారం గడుస్తున్నా హుడా అధికారులు కబ్జాదా రులకు సహకరిస్తున్నారని ఆరోపణలు జవహార్‌ నగర్‌ ప్రజల్లో విరివిరిగా వినిపిస్తున్నాయి. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి హుడాభూములను కాపాడాలనిస్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు