Friday, September 13, 2024
spot_img

ఫ్లైఓవ‌ర్ నుంచి కిందపడ్డ కారు..

తప్పక చదవండి

ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవ‌ర్‌పై నుంచి కారు కింద ప‌డ‌టంతో వ్య‌క్తి మ‌ర‌ణించిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. తూర్పు ఢిల్లీలోని బ‌రాపులా-నోయిడా లింక్ రోడ్ ప్రాంతం స‌మీపంలోని ఫ్లైఓవ‌ర్‌పై ఈనెల 26న ఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్ర‌మాదంలో జ‌గ‌న్‌దీప్ సింగ్ (42) మ‌ర‌ణించాడు. నోయిడాలో ప‌ని ముగించుకుని ఢిల్లీలోని కృష్ణా న‌గ‌ర్‌లోని ఇంటికి బ‌య‌లుదేరిన స‌మ‌యంలో దుర్ఘ‌ట‌న జ‌రిగింది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవ‌ర్‌పైకి పొర‌పాటున కారును ఎక్కించిన క్ర‌మంలో ప్ర‌మాదం జ‌రిగింద‌ని, 30 అడుగుల ఎత్తు నుంచి కారు కింద‌ప‌డింద‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బాధితుడు కారును న‌డుపుతున్నాడ‌ని పోలీసులు తెలిపారు.

సింగ్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మ‌ర‌ణించాడ‌ని వైద్యులు నిర్ధారించారు. కాగా మృతుడికి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు త‌దుప‌రి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు