హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. 26వ తేదీ సోమవారం రోజున జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సంజయ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురే మంత్రులు ఉన్నారని జీవన్ రెడ్డి అనడం బాధాకరం అన్నారాయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక్క బీసీ ముఖ్యమంత్రి అయినా ఉన్నారా అని సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కనీసం రాబోయే ఎన్నికల ముందైనా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి ప్రకటిస్తారా అన్ని వ్యాఖ్యానించారు. బీసీ అభివృద్ధి బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 4203 గొల్లకుర్మలకు కుటుంబాలకు ఉపాధి కల్గించామని వెల్లడిరచారు. మరి కాంగ్రెస్ పాలనలో 400 కుటుంబాలనైనా ఆదుకున్నారా అని నిలదీశారు సంజయ్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాన్నానై కాంగ్రెస్ నాయకులు ఆదుకున్నారా… ఏ వర్గానికైనా న్యాయం చేశారా అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీ బంధు కింద రూ. లక్ష ఇస్తున్నాం.. మరి ఏనాడైనా బీసీ కోసం ఒక్క రూపాయి ఖర్చు చేశారా అంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉందన్నారు. కేసీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ పార్టీ మూడోసారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్.