- అక్రమ రవాణ నివారణకు స్పెషల్ టాస్క్ఫోర్స్
- ఎంఆర్పీకి మించి మద్యం విక్రయాలు చేస్తే కేసులు
- ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ జీ.జనార్దన రెడ్డి
నేలకొండపల్లి : గంజాయి రవాణా పై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ జీ. జనార్ధన రెడ్డి తెలిపారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్రమ రవాణా ను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. స్థానిక ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్ ను మంగళవారం ఆయన సందర్శించి పలు రికార్డుల ను పరిశీలించారు. సర్కిల్ లో మద్యం విక్రయీలు, లిఫ్టింగ్ తదితర విషయాల పై రివ్వూ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడారు.. ఖమ్మం, భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో గంజాయి కదిలికలు లేకుండా పూర్తిగా ప్రత్యేక బృందాలను ఇప్పటికే ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు, ఇందు కోసం భద్రాచలం, అశ్వారావుపేట, ముత్తగూడెం, బోనకల్ ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది లో అక్రమంగా తరులుతున్న గంజాయి పై విస్త్రతంగా దాడులు చేసినట్లు, 10 కేసులు నమోదు చేసి, 15 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి నాలుగు వాహనాలు సీజ్ చేసి, 191 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకున్నామన్నారు. అదే విధంగా గుడుంబా 64 కేసులు నమోదు చేసి 76 మంది ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 13 వాహ నాలు సీజ్ చేసి, 412 లీటర్ల గుడుంబా ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో యంఆర్పీ కి మించి అధిక ధరలకు విక్రయించినందుకు మధిర, ఖమ్మం, ఇల్లందు, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, సత్తుపల్లి లో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు. వారి పై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉమ్మడి జిల్లాలో గుడుంబా వాసన లేకుండా చేయటానికి విస్తుతంగా దాడులు చేస్తున్నట్లు తెలిపారు. ఒరిస్సా, ఏపీ, మహరాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి అక్రమ మద్యం, గంజాయి, గుండబా రవాణా జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో ఖమ్మం ఎక్సైజ్ సూపరిండెంట్ జీ.నాగేందర్రెడ్డి, నేలకొండపల్లి సీఐ విజేందర్, ఎస్సైలు శంకర్. సందీప్ తదితరులు పాల్గొన్నారు.