Monday, June 17, 2024

అంగట్లో అంగన్వాడి గుడ్లు

తప్పక చదవండి
  • ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలలో దర్శనమిస్తున్న మార్కింగ్‌ వేసి ఉన్న గుడ్లు
  • వికారాబాద్‌ పట్టణంలో ఆదాబ్‌ కెమెరాకు అడ్డంగా దొరికిన వైనం
  • అధికారుల చేతి వాటం లేకుండానే జరుగుతుందా ఈ తతంగం..!

వికారాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన కోడిగుడ్లు అంగట్లో ప్రత్యక్షమ య్యాయి. బాలలకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికా హారం కింద వారానికి ఆరు గుడ్లు రోజుకొకటి చొప్పున అందించాల్సి ఉంది. అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన కోడిగుడ్లు తరచుగా బ్లాక్‌ మార్కెట్‌కు వెళ్లిపోతుండటంతో లబ్ధిదారులు నష్టపోతున్నారు. తాజాగా వికారాబాద్‌ పట్టణంలోని పలు పాస్ట్‌ ఫుడ్‌ సేంటర్లలో మార్క్‌ వేసి ఉన్న అంగన్వాడి గుడ్లు ఆదాబ్‌ న్యూస్‌ కెమెరాకు చిక్కాయి.అయితే ఇలాంటి అక్రమాలను నిరోధించేందుకు గుడ్లపై మార్కు వేసి అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.అయితే ఇలా మార్కింగ్‌ చేసిన గుడ్లను బయటి మార్కెట్‌లో విక్రయించడానికి వీల్లేదు. ఏ కారణం చేతనైనా అంగన్‌వాడీ కేంద్రాల నుంచి తిప్పి పంపినా ప్క్రెవేట్‌ దుకాణాల్లో ఉంచకూడదు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన గుడ్లను మిగిలించుకొని పక్కదారి పట్టిస్తున్న వ్యాపారులపై ఇప్పటికే నిఘా ఉంది.ఈ అక్రమాలకు ఐసీడీఎస్‌లోని కొంతమంది సిబ్బంది, అధికారులు కూడా సహకరించడం వల్లే వ్యాపారులు బహిరంగ మార్కెట్‌లో అంగన్‌వాడీ కేంద్రాల కోడిగుడ్లను విక్రయించగలుగుతున్నారనీ పలువురు మండిపడుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు