ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద మచిలీపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం నుంచి తిరుపతి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో టంగుటూరు వద్ద అకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్‌ను ఆపేశారు. రైలు దిగి పరుగులుపెట్టారు. అయితే బ్రేక్‌లలో ఉండే లూబ్రికెంట్ (Lubricant) అయిపోవడంతోనే చక్రాల రాపిడితో పొగలు వ్యాపించినట్లు తెలిసింది.
గమనించిన రైల్వే సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రైలుకు ఏమీ కాలేదని, లూబ్రికెంట్ అయిపోవడంతోనే పొగలు వచ్చాయని చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 20 నిమిషాల తర్వాత రైలు తిరిగి బయలుదేరింది. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన మరువక ముందే ట్రైన్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు వణికిపోయారు.