Monday, October 14, 2024
spot_img

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు బీఆర్‌ఎస్‌ వైపే చూస్తున్నారు..

తప్పక చదవండి

వైసీపీ పాలనతో తీవ్ర సంతృప్తితో ఉన్న ఏపీ ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీని ఆదరిస్తున్నారని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌ చెప్పారు. ప్రజావ్యతిరేక విధానాలతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న జగన్‌ అసమర్థ పాలనకు ఏపీ ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ ఏపీ క్యాంప్‌ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర నేతలు తోట సుబ్బారావు, జాలే వాసుదేవనాయుడు ఆధ్వర్యంలో పలు జిల్లాలకు చెందిన వైసీపీ నాయకులు తోట సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.

వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తోట చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయిన తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్‌ సారధ్యంలో శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఏపీలో అందుకు భిన్న పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం తమ రాష్ట్ర రాజధాని ఏదో చెప్పుకోలేని గందరగోళ పరిస్థితిలో రాష్ట్ర ప్రజానీకం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు