Monday, May 6, 2024

మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ప్రేమావతిచేతుల మీదుగా ప్రారంభమైన జాతీయ లోక్ అదాలత్

తప్పక చదవండి

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యూ ఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఆదేశాల మేరకు మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్- మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి , ప్రేమావతి సూచనల మేరకు మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ వారి అధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద కేసులు, గృహ హింస కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రిలిటీగేషన్ కేసులు పరిష్కరించబడ్డాయి. కక్షిదారులు, న్యాయవాదులు పెండింగ్ లో ఉన్న కేసులను ఈ లోక్ అదాలత్ లో సామరస్యంగా పరిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా సెషన్స్ జడ్జీ ప్రేమావతి మాట్లాడుతూ.. క్షణికావేశంలో చేసిన తప్పులని, పెండింగ్ లో వున్న కేసులను పరిష్కరించుకోటానికి, ఈ లోక్ అదాలత్ సరైన వేదిక అని పేర్కొన్నారు. ఒకసారి లోక్ అదాలత్ లో కేసు రాజీ అయిన తరువాత మళ్ళీ అప్పీల్ కు వెళ్ళే అవకాశం వుండదని తెలిపారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బదులు ఒకేసారి లోక్ అదాలత్ లో కేసును రాజీ చేసుకుంటే సమయం వృధా కాకుండా.. ఇరువర్గాలు తృప్తి చెందుతారని, ఈ విషయాన్ని న్యాయవాదులు, పోలీసులు పార్టీలకి అర్దం అయ్యేలా వివరించాలని కోరారు. న్యాయవాదులు ఈ లోక్ అదాలత్ లో ముఖ్యపాత్ర వహిస్తారని కొనియాడారు. పార్టీలకి సన్నిహితంగా వుంటారు కాబట్టి వారు లోక్ అదాలత్ వలన కలిగే ప్రయోజనాల గురించి పార్టీలకి వివరించి కేసులు రాజీ అయ్యేలా కృషి చేయాలని కోరారు. రాజీ అవ్వటం ఎవరు ప్రతికూలంగా తీసుకోవద్దని, కేసులను రాజీ చేసుకోటం వల్ల ఇరు పక్షాలు విజయం సాధిస్తారని పేర్కొన్నారు. మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జీ, రాధిక జైస్వల్ మట్లాడుతూ, మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికారా సంస్థ చైర్మన్ – సెషన్స్ జడ్జి ప్రేమావతి, రెండవ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి భూపతి, ఆరవవ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి జాన్సన్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయెల్ డేవిస్, మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ చేతుల మీదగా లోక్ ఆదాలత్ ను ప్రారంభించటం జరిగిందని, అలాగే లోక్ ఆదాలత్ లో తమ కేసులను రాజీ చేసుకున్న కొంతమంది కక్షిదారులకు లోక్ ఆదాలత్ అవార్డు కాపీలని వారి చేతుల మీదుగా అందజేయటం జరిగింది. న్యాయ సేవాధికార సంస్థ వారు జీ.హెచ్.ఎం.సి. వారి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 5 రూపాయల భోజన పతకం ద్వారా, భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది .

ఈ లోక్ అదాలత్ లో మొత్తం 32 బెంచిలు ఏర్పాటు చేశారు.. క్రిమినల్ కొర్టు కాంప్లెక్ష్ , సికింద్రాబాద్ కోర్టు కాంప్లెక్స్, మనోరంజన్ కోర్టు కాంప్లెక్స్, రైల్వే కోర్టు, సికింద్రాబాద్ కోర్టు, ఫ్యామిలీ కోర్టులు, పురాని హవేలీ కోర్టు నందు ఏర్పాటు చేయడం జరిగింది. 32 బెంచీలలో మొత్తం 102611 కేసులు పరిష్కరించబడ్డాయి.. ఇందులో కుటుంబ తగాదా కేసులు- 277, చెక్ బౌన్స్ కేసులు – 1615 కాగా, ఎస్.టి.సి. – 98050, సీసీ ఓ[ఈసీ – 2669 కేసులు పరిస్కరించబడినవి. లీగల్ ఎయిడ్ కౌన్సిల్, అనంత రఘు, న్యాయవాది, కె. వినోద్ కుమార్ ఇతర మీడియా వారు లోక్ అదాలత్ గురించి విస్తృత ప్రచారం చేయటం జరిగిందని మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాథికా జైస్వాల్ తెలిపారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు