Saturday, July 27, 2024

మాట ముచ్చట కార్యక్రమానికి తప్పక వస్తాను..

తప్పక చదవండి
  • బ్రోచర్ ను ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • జర్నలిస్టులకు అండగా ఉంటానని హామీ..
  • ఎల్.బీ. నగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జె.ఏ.సి. ఆధ్వర్యంలో కార్యక్రమం..

జర్నలిస్టులకు వారి కుటుంబాలకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల బృందం ఈనెల 10వ తేదీన ఎల్బీనగర్ చింతల్ కుంటలోని ప్రళవి గార్డెన్ లో జరిగే “మాట ముచ్చట” బ్రోచర్ ను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిదిగా ఉంటూ అనేక సమస్యలను తమ దృష్టికి తెచ్చే జర్నలిస్టుల సమస్యలు కూడా తనకు తెలుసని, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో అనేకమంది జర్నలిస్టులకు తాను ఇళ్ల స్థలాలు ఇప్పించానని.. జిల్లా పరిధిలో ఇల్లు లేని ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఇంటి జాగాలు ఇప్పిచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ ప్రతినిధి బృందం తనను మాట ముచ్చట కార్యక్రమానికి ఆహ్వానించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తాను తప్పకుండా జర్నలిస్టు కుటుంబాలతో కలిసి వాళ్ళ కష్టాలు బాధలు పంచుకుంటానని, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు