Tuesday, May 21, 2024

మోదీ హయాంలోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు రావాలి..

తప్పక చదవండి
  • ఆశాభావం వ్యక్తం చేసిన దాసు సురేశ్ , అధ్యక్షులు, బీసీ రాజ్యాధికార సమితి..

ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల రోడ్డు మార్గాన్ని 4 లేన్ లుగా విస్తరించడానికి, కాజిపేటలో వ్యాగన్ల ఫ్యాక్టరీలకు శంఖు స్థాపన చేసే క్రమంలో 30 సంవత్సరాల తర్వాత వరంగల్ నగరానికి భారత ప్రధాని విచ్చేయడం చారిత్రాత్మక ఘట్టమని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ హనుమకొండలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.. ఈ సందర్భంగా బీసీల ఆకాంక్షలను తెలియజేస్తూ ప్రధానికి ఒక లేఖను మీడియా ముఖంగా విడుదల చేసి ఢిల్లీలోని ప్రధానమంత్రి ఆఫీసుకు ఈ మెయిల్ పంపారు..

దేశంలోని బీసీల తలరాతలు మారాలంటే,ఈ వర్గాల నుండి నాయకత్వం ఎదగాలంటే అసెంబ్లీ పార్లమెంటులో బీసీలు అడుగెట్టాలని అందుకు అనుకూలంగా చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం ఒక చిన్న రాజ్యాంగ సవరణ జరగాలని పేర్కొన్నారు.. ప్రపంచ నేతలు మెచ్చే మోదీ మన దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని, బీసీల తలరాతలను మార్చాలనంటే మోదీ హయాంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ ల మాదిరిగా చట్టసభల్లో బీసీ రేజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలలో సైతం బీసీ లకు రిజర్వేషన్ లు సాధ్యమవ్వడానికి మోదీ సహకరించాలన్నారు ..

- Advertisement -

రాజకీయ కారణాల వల్ల వేలాది మందికి ఉపాధి లభించే వరంగల్లోని టెక్స్టైల్ పార్కును ప్రధాని ప్రారంభించక పోవడాన్ని దాసు సురేశ్ తప్పుబట్టారు.. పీఎం మిత్ర పథకానికి అధికారిక అనుమతులివ్వని రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదన్నారు. వరంగల్ నగరం తరచూ వరదల బారిన పడుతుందని,వరదల బారి నుండి వరంగల్ ముంపు ప్రాంతాలను కాపాడడానికి ప్రత్యేక ప్యాకేజీని స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా విడుదల చేయాలని ప్రధానిని కోరారు..వరంగల్ నగరంలోని మామునూరులో సత్వరమే విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ,ములుగులో గిరిజన యూనివర్సిటీ తదితర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రధానిని కోరారు..ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి పొదిల సాయిబాబ , ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి ఈదునూరి రాజమౌళి, హనుమకొండ జిల్లా ఇంచార్జి గాజు యుగేందర్ యాదవ్, హనుమకొండ నియోజక వర్గ ఇంచార్జి శ్రీధర్ రాజు, కన్వీనర్ గజ్జెల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు