యువతకు సూచన చేసిన హోంమంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతల విషయంలో మొదటి స్థానంలో ఉందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శౌర్య కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని అలాంటి యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. వీటి బారిన పడకుండా తాము ఎన్నుకున్న రంగంలో అద్భుతాలు సాధించాలని కోరారు. ఇప్పటకే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం తక్కువగానే ఉందని.. దాన్ని కూడా పూర్తిగా నిర్మూలించేదుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడిరచారు.ప్రతిరంగంలో కొంతమంది అద్భుతాలు సృష్టిస్తే మరికొందరు చెడుమార్గంలో వెళ్తున్నారని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. దేశంలో సుమారు 11 కోట్ల మంది డ్రగ్స్ అలవాటుపడినట్లు నివేదికలో వెల్లడైందని తెలిపారు. మాదక ద్రవ్యాల మోజులో పడి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. అలాగే కొంతమంది యువకులు డ్రగ్స్‌కు అలవాటి పడి బానిసైపోవడం బాధ కలిగిస్తోంది నటి కృతిశెట్టి అన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా వారిని రక్షించడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తన్నారని తెలిపారు. అందరూ కూడా వీటిని అరికట్టడంలో తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.