Friday, May 3, 2024

మాకొద్దు ఈ మున్సిపాలిటీ..

తప్పక చదవండి
  • చేవెళ్ల మున్సిపాలిటీలో
    చెలరేగిన చిచ్చు..
  • తెరమీదకు గ్రామ పంచాయితీగా
    ఉండాలనే డిమాండ్‌..
  • ఊరెళ్ల, దేవుని ఎర్రవల్లి, పామెన
    గ్రామాల్లో నిరసనల హోరు..
    చేవెళ్ల: తాజాగా చేవెళ్ల మండలాన్ని మున్సిపాలిటీగా మారుస్తుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.. మండలంలోని పలు గ్రామాల్లో మున్సిపాలిటీ అవసరం లేదని నిరసనలు తెలుపు తున్నారు.. మున్సిపాలిటీని వ్యతిరేకిస్తూ మొన్న ఊరెళ్ల గ్రా మం, నిన్న పామెన, ఇప్పుడు దేవుని ఎర్రవల్లి గ్రామాలు కూ డా కలిశాయి. గ్రామాల్లో యువకులే కాకుండా.. పార్టీలకు అతీతంగా నాయకులు కూడా మాకొద్దు మున్సిపాలీటీ అం టూ ప్లకార్డులు చూపిస్తూ గ్రామంలో అన్ని వీధులు తీరు గు తూ నిరసనలు తెలుపుతున్నారు.ఊరేళ్ల గ్రామస్థులు.. మున్సి పాలిటీలో కలిపితే అభివృద్దికి నోచుకోదని, సమస్యల పరిష్కా రానికి దూరమవతామని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పామెన గ్రామంలో.. నేరుగా గ్రామపంచాయితీకి రావల్సిన నిధులు గ్రామ పంచాయితీకి కాకుండా.. మున్సి పాలిటీలో చేరి..గ్రామం అభివృద్ది కుంటుపడుతుందని తెలుపుతున్నారు.
    నిర్ణయాన్ని మార్చుకోవాలి :
    దేవుని ఎర్రవల్లి గ్రామస్తులు గ్రామాన్ని మున్సిపాలిటిలో కలిపే నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ధర్నా, నిరసనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు