Tuesday, June 18, 2024

నేడే లష్కర్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు..

తప్పక చదవండి
  • ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం..
  • భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు..

సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. నేడు బోనాలు, సోమవారం రంగం కార్యక్రమం జరుగనుంది. చారిత్రాత్మకమైన మహంకాళి అమ్మవారి జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, జలమండలి, ఆర్అంబీ తదితర శాఖల అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నిఏర్పాట్లు చేపట్టారు.

విద్యుత్ కాంతులతో ముస్తాబైన ఆలయం :
బోనాల సందర్భంగా మహంకాళి దేవాలయం రంగులతో ముస్తాబు చేశారు. దేవాలయం మొత్తం విద్యుత్ దీపాలు, పువ్వులు, పండ్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దేవాలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో స్వాగత తోరణాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు.

- Advertisement -

తెల్లవారుజామున 3,30 గంటలకు తొలి పూజ :
ఈ తెల్లవారు జామున మూడు గంటల 30 నిమిషాలకు అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా తొలిపూజ,హారతిలో పాల్గొన్నారు.. సాదారణ భక్తులు దర్శనంచేసుకునేందుకు నాలుగు గంటల 15 నిమిషాలకు అనుమతించారు..

మొత్తం 6 క్యూలైన్లు – బోనాలతో వచ్చే భక్తులకు రెండు లైన్లు :
మొత్తం 6 క్యూలైన్లు-బోనాలతో వచ్చే భక్తులకు రెండుబోనాల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఒకటి పాత రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్, మరొకటి బాటా వైపు నుంచి ఏర్పాటు చేశారు. అలాగే పాత రాంగోపాల్పేట్ వైపు ఒకటి సాధారణ భక్తులకు, టొబాకో బజార్ నుంచి దాతల కోసం, అంజలీ ధియేటర్ నుంచి వీఐపీ పాస్ లతో వచ్చే వారికి ఒకటి, సాదారణ భక్తులు కోసం మరో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీవీఐపీలు మాత్రం దేవాలయ ఆరో గేటు నుంచి నేరుగా లోపలికి వస్తారు.

నాలుగు ఎగ్జిట్ గేట్లు :
అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భయటకు వెళ్లేందుకు గతంలో మూడు గేట్లు ఉండగా ఈ ఏడాది అధనంగా మరొక గేటును ఏర్పాటు చేశారు. దీంతో అమ్మవారి దర్శనం వెంటనే భయటకు వెళ్లి రద్దీ తగ్గుతుంది.

మంచినీళ్లు, వైద్య శిభిరాలు :
భక్తులకు మంచి నీరు అందించనున్నారు. 7 లక్షల వాటర్ ప్యాకెట్లతో పాటు 250 ఎంఎల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేయనున్నారు. మహంకాళి పోలీస్ స్టేషన్, బొమ్మన బ్రదర్స్, సోలాపూర్ స్వీట్ హౌజ్ ప్రాంతంలో డీఎం అండ్ హెచ్ ఓ ఆధ్వర్యంలో వైద్య శిభిరాలు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి మందులు ఉచితంగా అందిస్తారు.

సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో :
అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు బోనాల జాతర విశిష్టత తెలియ చెప్పేలా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వేధికలు ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు వందలాది మంది కళాకారులు ఆట, పాట లతో సంస్కృతిక ప్రదర్శన ఇవ్వనున్నారు.. అలాగే అగ్నిమాపక శాఖ 4 ఫైరింజన్లు, 2 బుల్లెట్ ద్విచక్రవాహనాలను అందుబాటులో ఉంచారు..

పార్కింగ్ చేయాల్సిన ప్రాంతాలు :
ఎంజీ రోడ్డు గాంధీ విగ్రహం (సీటీవో ప్యారడైజ్ నుంచి వచ్చేవారికి) .. ఎస్ డి రోడ్లు (తాజ్ క్రైస్టార్ బేగం పేట నుంచి వచ్చే వారికి ).. ఇస్లామియా స్కూల్ మోండా మార్కెట్ ఎదురుగా హరిహర కళాభవన్ దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేశారు.

గుడి లోపల, గుడి బయట, ప్రధాన ముఖ ద్వారం, సుభాష్ రోడ్డు, ఆర్పీరోడ్డు, ఎంజీరోడ్లు, ఎస్టీ రోడ్డు, ఎసీరోడ్డు ప్రాంతాల్లో మూడంచెల భద్రతగా నేతలు, భక్తులు, ప్రముఖులు రానుండటంతో రెండు వేలమంది పోలీసులు సేవలందించనున్నారు. దాదాపు 2వందల: సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాటు చేశారు.. మహబూబ్ కళాశాల (ప్యాట్నీ సెంటర్ నుంచి వచ్చేవారికి) అంజలి థియేటర్ (జనరల్బజార్ నుంచి వచ్చే వాహనాలు) రాణిగంజ్ అడివయ్య కూడలి ప్రభుత్వ పాఠశాల (ట్యాంక్ బండ్ నుంచి వచ్చే రాణా నుంచి నేరుగా ప్రధానముఖ ద్వారం ద్వారా వారికి) పార్క్ లైన్, ఎంజీరోడ్డు గాంధీ ఆలయానికి చేరుకుంటారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు