Tuesday, May 7, 2024

నేను నిప్పుని…( తేల్చి చెప్పిన మరాఠా దిగ్గజం శరత్ పవార్.. )

తప్పక చదవండి
  • నేను ప్రధాని కావాలనుకోవడం లేదు..
  • మా పార్టీలో తిరుగుబాటు దారులకు చోటు లేదు..
  • అజిత్ పవార్ కి సూటిగా సమాధానం..
  • శనివారం రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం..

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటుదారులకు చోటు లేదని ఆ పార్టీ చీఫ్, మరాఠా దిగ్గజనేత శరద్ పవార్ చెప్పారు. తనకెలాంటి అలసట లేదని, రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని, తనలోని ఫైర్ చెక్కుచెదరలేదని చెప్పారు. అదే ఫైర్‌తో పార్టీ కార్యకర్తల కోరిక మేరకు తన కర్తవ్యాన్ని కొనసాగిస్తానని, పార్టీని తిరిగి పటిష్టం చేస్తానని తెలిపారు. అజిత్ పవార్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు ఇటీవల తిరుగుబాటు చేయడం, వయసు పైబడిన కారణంగా క్రియాశీలక రాజకీయాల్లోంచి తప్పుకోవాలంటూ అజిత్ పవార్ సూచించిన నేపథ్యంలో తొలిసారిగా శరద్ పవార్ ఓ ఇంటర్వ్యూలో సూటిగా సమాధానాలిచ్చారు.

మొరార్జీ దేశాయ్ ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యారో మీకు తెలుసా? నేను ప్రధానినో, మంత్రినో కావాలని అనుకోవడం లేదు. ప్రజలకు సేవ చేయాలని మాత్రమే కోరుకుంటున్నాను” అని పవార్ స్పష్టం చేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్‌పేయి మాటలను పవార్ గుర్తుచేసుకుంటూ, తాను మరీ అంత వయసుపైబడి లేనని చెప్పారు. “నన్ను రిటైర్ కావాలని చెప్పేందుకు వాళ్లెవరు? నేను ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నాను” అని అజిత్ పవార్ వ్యాఖ్యలను శరద్ పవార్ తిప్పికొట్టారు.

- Advertisement -

ఎన్‌సీపీలో అధికారాలన్నీ తన కుమార్తె సుప్రియా సూలేకు కట్టబెట్టారంటూ ప్రఫుల్ పటేల్ చేసిన ఆరోపణలను సీనియర్ పవార్ తోసిపుచ్చారు. సుప్రియ రాజకీయాల్లోకి రావాలని పార్టీ కార్యకర్తలు కోరుకున్నారని, లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసి గెలిచారని చెప్పారు. ప్రఫుల్ పటేల్‌కు పదేళ్ల పాటు కేంద్ర మంత్రి పదవి ఇచ్చామని, లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఆయనను రాజ్యసభకు పంపామని శరద్ పవార్ సమాధానమిచ్చారు. కాగా, ఎన్‌సీపీని తిరిగి పటిష్టం చేయనున్నట్టు ప్రకటించిన శరద్ పవార్ ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్త పర్యటనకు శనివారంనాడు శ్రీకారం చుట్టారు. ఎన్‌సీపీ తిరుగుబాటు నేత, రాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ నియోజకవర్గమైన నాసిక్ జిల్లా ఏవల నుంచి ఆయన తన పర్యటన ప్రారంభించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు