Saturday, May 18, 2024

ఖమ్మం పార్లమెంటరీ టీడీపీ కార్యదర్శిగా చారుగుండ్ల దేవి ప్రసాద్..

తప్పక చదవండి
  • సుజాతానగర్ ప్రాంతానికి చెందిన నాయకుడు..

ఈ సందర్భంగా చారుగుండ్ల దేవీ ప్రసాద్ మాట్లాడుతూ.. టీడీపీ లో ఎంతో మంది ఉన్న సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు ఈ పదవి రావడం చాలా సంతోషంగా ఉందని.. ఏ పార్టీలో లేని సంస్కృతి తెలుగుదేశం పార్టీ సొంతం అన్నారు.. ఎందుకంటే. టీడీపీలో మాత్రమే సామాన్య కార్యకర్త కూడా నాయకులు అవుతారని. అందుకు తనకు వచ్చిన పదవే నిదర్శనం అని, తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా. సైనికులుగా పనిచేస్తాం అని నాకు పదవి రావడానికి సహకరించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు. నారా. చంద్రబాబు నాయుడుకి, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కి, తెలంగాణ తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు. కాపా కృష్ణ మోహన్ కి, కొత్తగూడెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ బీసీ నేత కనుకుంట్ల కుమార్ కి, సుజాత నగర్ మండల అధ్యక్షులు మండవ సురేష్ కి, ప్రధాన కార్యదర్శి ఎండీ. అక్బర్ పాషా కి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ కొత్తగూడెం పట్టణ ఉపాధ్యక్షలు ఎండీ. సర్వర్ కి, చుంచుపల్లి మండల అధ్యక్షులు కోటయ్యకి, ప్రధాన కార్యదర్శి ఎండీ. తాజ్ కి, లక్ష్మీదేవి పల్లి మండలం అధ్యక్షులు సపవత్ శివ నాయక్ కి, ఐటీడీపి ఆనంద్ కి కృతజ్ఞతలు తెలిపారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు