Tuesday, September 10, 2024
spot_img

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మర్యాదపూర్వక సన్మానం..

తప్పక చదవండి

శనివారం రోజు జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు స్ఫూర్తి ఫిష్ సీడ్ సప్లయర్స్, ముదిరాజ్ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కు శాలువా కప్పి బొకేనందించి ఘనంగా సన్మానించినారు..

ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యక్షులు చింతల యాదయ్య ముదిరాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.. జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వము అందిస్తున్న సబ్సిడీ పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని ముదిరాజ్ మత్స్యకారులకు అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ల సదానంద ముదిరాజ్, జిల్లా కార్యదర్శి ఇట్టబోయిన రమేష్ ముదిరాజ్, నర్మెట మండల అధ్యక్షులు వంగాల గోవర్ధన్ ముదిరాజ్, మద్దూర్ మండల ఎంపీపీ బద్దిపడిగా కృష్ణారెడ్డి, నర్మెట ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, జిల్లా కోఆప్షన్ నెంబర్ ఎండి గౌస్, నర్మెట తరిగొప్పుల మండలాల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, వంశి గ్రూప్ అధినేత శనిగరం మల్లేశం, ఎర్ర గొల్లపాడు సర్పంచు ఒంగల శంకర్, గానుపాడు సర్పంచ్ సాన బోయిన శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొని ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు