Sunday, June 9, 2024

సమస్యల వలయంలో కస్తూర్బా పాఠశాల

తప్పక చదవండి
  • గదుల కొరత కారణంగా విద్యార్థులకు తప్పని ఇక్కట్లు
  • ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
  • పట్టించుకోని సంబంధిత అధికారులు
  • పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి
    వికారాబాద్‌ జిల్లా : వికారాబాద్‌ జిల్లా రిక్షా కాలనీ సమీపంలో గల కస్తూర్బా పాఠశాల లో గదుల కొరత కారణంగా విద్యార్థులు,ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.జిల్లా కేంద్రంలో గల కేజిబివి పాఠశాలలో 200 మందికి సరిపోను గదులు మాత్రమే ఉన్నాయి.కానీ అందులో ఏకంగా 400 మంది విద్యార్థులకు పైగా ఉండటం గమనార్హం.కాగా విద్యార్థుల సౌకర్యార్థం గత కొన్నేళ్లుగా నూతన భవన సముదాయ నిర్మాణం చేపట్టగా ఈ మధ్య కాలంలోనే భవన నిర్మాణం తుది దశకు చేరుకుంది.అయినప్పటికీ ప్రారంభానికి నోచుకొకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు భావిస్తున్నారు. కేజీబీవీ పాఠశాల నూతన భవన సముదాయం పూర్తయినప్పటికీ, భవనాన్ని ప్రారంభించి కస్తూర్బా పాఠశాలకు అప్పగించడంలో సంబంధిత అధికారులు,పాలకులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా వికారాబాద్‌ జిల్లాలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ పనులు కొనసాగుతుండగా మెడికల్‌ కళాశాల విద్యార్థులకు కేజీబీవీ నూతన భవనాన్ని కట్టబెట్టే యోచనలో ప్రభుత్వ పాలకులు, అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయాన్ని కనుక అధికారులు తీసుకుంటే కేజీబీవీ పాఠశాల విద్యార్థుల ఇక్కట్లు ఇంకెన్నటికి నెరవేరే పరిస్థితి ఉండదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.

కలెక్టర్‌కు విన్నవించిన విద్యార్థులు..
కేజీబీవీ భవనాన్ని మెడికల్‌ కాలేజీకి ఇవ్వకూడదని పాఠశాల కు అప్పగించి మా ఇబ్బందులను తీర్చాలని విద్యార్థులు కలెక్టర్‌ ను వేడుకున్నట్లు తెలుస్తోంది. అందుకు కలెక్టర్‌ స్పందిస్తూ ఆ భవనాన్ని కేజీబీవీకే కేటాయిస్తామని విద్యార్థులకు కలెక్టర్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం.వసతి గృహంలో సౌకర్యాలపై జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి విద్యార్థులను అడిగి తెలుసుకోగా టాయిలెట్స్‌ తలుపులు కిటికీలు సరిగా లేవని కలెక్టర్‌ తో విన్నవించగా మరమ్మత్తులను చేపట్టాలని సంబంధిత అధికారికి కలెక్టర్‌ ఆదేశించారు. తదనంతరం కేజీబీవీ నూతన భవనాన్ని పరిశీలించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు