తమిళ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్ సొంతం చేసుకునే చిత్రంగా కూడా కంగువ నిలుస్తుందని భావిస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో సూర్య కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో చేస్తోన్న మూవీ కంగువ. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. కేఈ జ్ఞాన్ వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నాత్తై తర్వాత శివ నుంచి రాబోతున్న మూవీ ఇదే కావడం విశేషం. రీసెంట్ గా సూర్య పుట్టిన రోజు సందర్భంగా మూవీ ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ నేపథ్యం సంగీతం కూడా గ్లింప్స్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్లిందని చెప్పాలి. ఈ వీడియో లో సూర్య ఒక అటవీక వీరుడి గా ఉన్నాడు. అతని లుక్ చాలా డిఫెరెంట్ గా ఉంది. పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఉండబోతోంది. మూవీ లో సూర్య క్యారెక్టర్ కూడా రెండు వేరియేషన్స్ లో ఉండనుందని టాక్ వినిపిస్తోంది. దిశా పటాని చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ని ఏకంగా మూడు భాగాలుగా తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారంట. పెదకాపులో అడ్డాల రొమాంటిక్ టచ్ మొదటి భాగం షూటింగ్ చేస్తూనే రెండో భాగంకి సంబందించిన స్క్రిప్ట్ కంప్లీట్ చేసే పని లో ఉన్నారంట. అలాగే ఈ రెండు సినిమాల సక్సెస్ పట్టి పార్ట్ 3 ప్లాన్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల లో వినిపిస్తోన్న మాట. వచ్చే ఏడాది ఈ కంగువ పార్ట్ 1 రిలీజ్ కానుంది. విజువల్ వండర్ గా కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఎలిమెంట్స్ తోనే చిత్రాన్ని శివ ఆవిష్కరిస్తున్నారు. గ్లింప్స్ లోనే కంటెంట్ ఎలా ఉండబోతుందనేది క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ మూవీ కూడా బాహుబలి, కేజీఎఫ్ సిరీస్ ల తరహా లోనే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతుంది. తమిళ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్ సొంతం చేసుకునే చిత్రంగా కూడా కంగువ నిలుస్తుందని భావిస్తున్నారు. అందుకే ఖర్చుకి వెనుకాడకుండా గ్రాండియర్ గా సినిమాని దర్శకుడు శివ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. సూర్య కెరియర్ లో మొదటి పీరియాడికల్ జోనర్ పాన్ ఇండియా చిత్రంగా తెరక్క్కుతో తెరకెక్కుతోన్న కంగువ మూవీ ఏ మేరకు నిర్మాత అంచనాలని అందుకుంటుంది అనేది చూడాలి. ఫస్ట్ గ్లింప్స్ తో ఇప్పటికే సినిమాపై హైప్ క్రియేట్ చేసిన నేపథ్యంలో
బిజినెస్ పరంగా కూడా అప్పుడే
వస్తున్నాయని టాక్.
తప్పక చదవండి
-Advertisement-