ముంబై : ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ).. గురువారం జీవన్ కిరణ్ (ప్లాన్ నం.870) పేరుతో ఓ కొత్త పాలసీని ప్రారంభించింది. ఇదో నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, సేవింగ్స్, జీవిత బీమా ప్లాన్. ఈ పాలసీ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఐఎన్) 512ఎన్353వీ01 అని ఓ ప్రకటనలో ఎల్‌ఐసీ తెలియజేసింది. అలాగే అదనపు ప్రీమియం చెల్లింపుల ద్వారా యాక్సిడెంటల్ డెత్ లేదా డిజబిలిటి బెనిఫిట్ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ వంటివి అందుబాటులో ఉంటాయి. నిర్ణీత వ్యవధిపై మెచ్యూరిటీ/డెత్ బెనిఫిట్ పొందేందుకు సెటిల్మెంట్ ఆప్షన్ కూడా ఉంటుందని సంస్థ ఈ సందర్భంగా వెల్లడించింది. కాగా, www. licindia.in వెబ్‌సైట్‌పై ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో సంస్థకు చెందిన ఏజెంట్లు, కార్పొరేట్ ఏజెంట్లు, బ్రోకర్లు, ఇన్సూరెన్స్ మార్కెటింగ్ సంస్థల నుంచి ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు.
జీవన్ కిరణ్ పాలసీ విశేషాలు
ఈ ప్లాన్‌లో ప్రీమియం రిటర్న్‌తో లైఫ్ కవరేజీ
తక్కువ ధరకే ఎక్కువ జీవిత బీమా
18-65 ఏండ్ల వయసువారు ఈ పాలసీకి అర్హులు
కనీస బీమా రూ.15 లక్షలు.
బీమా రూ.50 లక్షలకుపైగా తీసుకుంటే ట్యాబులర్ ప్రీమియంపై రిబేట్
10-40 ఏండ్ల వరకు పాలసీ టర్మ్
పొగ త్రాగేవారు, త్రాగనివారికి వేర్వేరుగా పీమియం రేట్లు
సింగిల్ ప్రీమియం లేదా రెగ్యులర్ ప్రీమియం ఆప్షన్లు
సింగిల్ ప్రీమియం పాలసీలకు కనీస ఇన్‌స్టాల్మెంట్ రూ.30,000
రెగ్యులర్ ప్రీమియం పాలసీలకు కనీస ఇన్‌స్టాల్మెంట్ రూ.3,000
తప్పక చదవండి
-Advertisement-