Wednesday, April 17, 2024

12 నెలలకు రెన్యువల్ ఇవ్వాలి..

తప్పక చదవండి
  • ఇంటర్మీడియట్ ఆర్.జె.డీ కి కాంట్రాక్టు లెక్చరర్స్ విజ్ఞప్తి..

అమరావతి, 27 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తాము పని చేస్తున్న 12 నెలల కాలానికి రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం జూనియర్ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు శుక్రవారం జోన్ 1,జోన్ 2 ఆర్.జె.డి. అధికారి ఐ. శారదను తమ కార్యాలయంలో కలిసి ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొర్ల మాణిక్యం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. సంవత్సరం 12 నెలలు పొడవునా పని చేస్తున్నప్పటికీ 11నెలలకి మాత్రమే రెన్యువల్ ఇవ్వడం చాలా దారుణమని వాపోయారు. ఇంటర్మీడియట్ వ్యవస్థకు సంబందించిన అడ్మిషన్స్, క్లాసులు,పరీక్షలు, ప్రాక్టీకల్స్,స్పాట్ వాల్యూషన్, ప్రతీది కాంట్రాక్టు లెక్చరర్స్ తోనే ముడిపడి నడుస్తోందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం 11నెలలకే రెన్యువల్ ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గత 23 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం పైనే ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్నామని ఇప్పుడు ఇలా రెండు నెలలు కోత పెడితే తాము ఎలా తమ కుటుంబాలను పోషించుకోగలమన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి స్వల్ప విరామంతో 12 నెలలు రెన్యూవల్ ఇచ్చారని కానీ ఈ సంవత్సరం దానికి భిన్నంగా 11 నెలలు మాత్రమే ఇవ్వడం అన్యాయమన్నారు. ఒక ప్రక్క తెలంగాణ రాష్టంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అక్కడ కాంట్రాక్టు లెక్చరర్స్ అందరి సర్వీసు రెగ్యులరైజ్ చేస్తే ఇక్కడ మాత్రం ఇంకా రెన్యూవల్ కోసం పాడిగాపులు గాయాల్సొస్తుందని మనోవేదనకు గురయ్యారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడు షేక్ రబ్బానీ గౌస్, ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి గోవిందరాజులు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే తమ సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పేర్వేల సూర్య నారాయణ మూర్తి, శివన్నారాయణ, కె. సూర్య నారాయణ, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు