Saturday, May 11, 2024

జనసేనాని ప్రకటనపై సర్వత్రా ఆసక్తి..

తప్పక చదవండి
  • ఎవరూ ఊహించని రీతిలో ప్రకటన చేయబోతున్న పవన్..
  • నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే ఎన్డీఎ మీటింగ్ లో జనసేన..
  • తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై దృష్టి పెట్టాం : పవన్ కళ్యాణ్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వేదికగా కీలక ప్రకటన చేయబోతున్నారు. పవన్ ప్రకటన ఏమై ఉంటుందా..? అని తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ఎవరూ ఊహించని రీతిలో ప్రకటన ఉండొచ్చని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్నారు. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీఏ సమావేశంలో జనసేన పాల్గొనబోతోంది. ఇప్పటికే పవన్, ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ ఇద్దరూ ఢిల్లీకి చేరుకున్నారు. ఆహ్వానం అందడంతో ఎన్డీఏ పక్షాల సమావేశానికి బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఆహ్వానం వచ్చిందని పవన్ చెప్పారు. ఎన్డీఏ పాలసీలు ఏవిధంగా ప్రజల్లో తీసుకెళ్లాలనే దానిపై నేటి సమావేశంలో చర్చ జరగవచ్చన్నారు. 2014 ఎన్నికల్లో ఎన్డీఏలో భాగంగా ఉన్నామన్న విషయాన్ని సేనాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యంగా.. తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై దృష్టిపెట్టినట్లు పవన్ తెలిపారు..

2014 నుంచి ఎన్డీఏలో ఉన్న పవన్.. అలాగే కొనసాగాలా..? లేకుంటే బయటికి రావాలా..? అనేదానిపై పార్టీ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. నేటి సమావేశంలో ఎన్డీఏ పక్షాల విధి విధానాలేంటి..? ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీపై ఎన్డీఏ వైఖరేంటి..? అనే విషయాలపై నిశితంగా చర్చకొచ్చాకే పవన్ పొత్తు నిర్ణయాన్ని బయటపెట్టే అవకాశముంది. వాస్తవానికి ఇలాంటి సమావేశాల కోసం పవన్ చాలా కాలంగా వేచి చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి మార్గాలపై నేటి భేటీలో చర్చించిన తర్వాత ఎలా ముందుకెళ్లాలనే దానిపై పవన్ ఓ నిర్ణయానికి రానున్నారు. ఒకవేళ ఎన్డీయేలో కొనసాగితే.. విధి విధానాలేంటి..? వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్నదానిపై సమాలోచనలు చేయడానికి పవన్ సిద్ధమవుతారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

- Advertisement -

కాగా.. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరగబోతోంది. ఎన్డీఏను వీడిన పార్టీలను సైతం బీజేపీ పెద్దలు ఆహ్వానించడం జరిగింది. ఇప్పటి వరకూ ఎన్‌డీఏ సమావేశంలో 38 పార్టీలు పాల్గొంటున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారిక ప్రకటన చేశారు. మరోవైపు బెంగళూరు వేదికగా.. విపక్షాల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి 26పార్టీలకు చెందిన 53 మంది నేతలు హాజరవుతున్నారని ప్రకటన వచ్చేసింది. విపక్ష నేతలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విందు ఏర్పాటు చేశారు. కాగా ఈ సమావేశానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, యువనేత రాహుల్ గాంధీ, కీలక నేత కేసీ వేణుగోపాల్ వచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు