Wednesday, June 19, 2024

పార్ల‌మెంట్‌లో కుమారుడికి పాలు ఇచ్చిన‌ ఎంపీ..

తప్పక చదవండి

ఇట‌లీ పార్ల‌మెంట్‌లో అరుదైన దృశ్యం చోటుచేసుకున్న‌ది. ఆ దేశానికి చెందిన మ‌హిళా ఎంపీ గిల్డా స్పోర్టిల్లోత‌న కుమారుడికి పార్ల‌మెంట్ హాల్‌లోనే పాలు ఇచ్చింది. స‌భ్యులు కూర్చునే బెంచ్ వ‌ద్ద పిల్లోడిని ఎత్తుకుని చ‌నుబాలు తాగించింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల తోటి ఎంపీలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ చ‌ప్ప‌ట్లు కొట్టారు. సంప్ర‌దాయంగా పురుషుల ఆధిక్యం ఉన్న ఇట‌లీలోని దిగువ స‌భ‌లో ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం విశేషమే. ఎంపీ గిల్డా కుమారుడి పేరు ఫెడ్రికో. ఆర్నెళ్ల వ‌య‌సే ఉన్న ఆ చిన్నారికి పార్ల‌మెంట్‌లో ఉన్న ఎంపీలు ఆశీస్సులు అందించారు. సుదీర్ఘ‌మై, స్వేచ్ఛాయుత‌మైన, శాంతియుత జీవితాన్ని ఫెడ్రికో పొందాల‌ని కోరుతూ ఆ స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్న చైర్మెన్ జార్జియో మూల్ తెలిపారు. పాలు తాగే పిల్ల‌లు ఉన్న మ‌హిళా ఎంపీలు త‌మ పిల్ల‌ల‌ను పార్ల‌మెంట్‌కు తీసుకురావ‌చ్చు అని గ‌త న‌వంబ‌ర్‌లో ఇట‌లీ చ‌ట్టం చేసింది. ఏడాది వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు పిల్ల‌ల‌కు బ్రెస్ట్‌ఫీడింగ్ చేయ‌వ‌చ్చు అని తీర్మానించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు