Tuesday, May 14, 2024

గ్రామ సర్పంచ్‌ కర్కశత్వం

తప్పక చదవండి
  • కూతురు ప్రేమ వివాహం చేసుకుందని పైశాచికం
  • ప్రియుడి ఇంటిని దగ్ధం చేసిన సర్పంచ్‌ రవీందర్‌
  • వరంగల్‌ జిల్లాలో ఇటికాలపల్లిలో దారుణ ఘటన

నర్సంపేట : కూతురు తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన గ్రామ సర్పంచ్‌ రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట మండలంలోని ఇటికాలపల్లి పెళ్లిలో ప్రదర్శించారు. అర్ధరాత్రి మూతికి గుడ్డలు కట్టుకున్న పలువురు వ్యక్తులు తన కూతురి వివాహానికి సహకరించారంటూ కూతురి భర్త ఇల్లు తో పాటు మరో ముగ్గురు ఇళ్లను దగ్ధం చేసి ధ్వంసం చేసిన సంఘటన ఇటికాలపలలో అర్ధరాత్రి జరగడంతో యావత్‌ వరంగల్‌ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా సంచలనమైంది. గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం నర్సంపేట మండలంలోని ఇటుకలపల్లి గ్రామానికి చెందిన అధికార పార్టీ సర్పంచ్‌ మండల రవీందర్‌ (ముదిరాజ్‌) కూతురు కావ్య ఇదే గ్రామానికి చెందిన రజక కులానికి చెందిన రంజిత్‌ ను గత ఐదు రోజుల క్రితం ఇంటి నుండి పారిపోయి ప్రేమ వివాహం చేసుకొని హనుమకొండ జిల్లాలోని హసన్పర్తి ఏరియాలో నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్న సర్పంచ్‌ రవీందర్‌ హసన్పర్తి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు సైతం చేశాడని దాంతో పోలీసులు ప్రేమ జంటకు కౌన్సిలింగ్‌ నిర్వహించినప్పటికీ ఇంటికి వెళ్లే ప్రసక్తి లేదని కావ్య భీష్మించడంతో చేసేదిలేక వెను తిరగి గ్రామానికి విచ్చేసిన సర్పంచ్‌ మరికొందరి వ్యక్తులతో పాటు అర్థరాత్రి కూతురి భర్త రంజిత్‌ ఇంటిని అదేవిధంగా ఈ ప్రేమ విహానికి సహకరించాలని రంజిత్‌ స్నేహితులైన బొడ్డుపల్లి విజయ్‌ దామెర రాకేష్‌ బూస ప్రవీణ్‌ ఇంటిలను సైతం దగ్ధం చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటన సుమారుగా అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జరగడంతో చుట్టుపక్కల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేం గోరం జరుగుతుందని పక్కింటికి మంటలు వెళితే ఊరంతా ప్రమాదం జరిగేదని ఆందోళన చెందారు. సమాచారం తెలుసుకున్న నర్సంపేట ఏసిపి సంపత్‌ రావు పట్టణ సీఐ పులి రమేష్‌ ఎస్‌ఐలు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తూ ద్వంసమైన ఇళ్లను పంచనామ నిర్వహించారు. కాగా ఈ ఘటన సమాచారం తెలుసుకున్న నర్సంపేట ప్రజలు సోషల్‌ మీడియాలో పోస్ట్లు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కులం తక్కువ వాడు అయినందుకే అధికార పార్టీ సర్పంచ్‌ మండల రవీందర్‌ పట్టరాని కోపంతో ఈ విధ్వంసానికి పూనుకున్నాడని పలువురు వాపోతున్నారు. కాగా ఇల్లు ధ్వంసమైన బాధితులు సర్పంచ్తో ప్రాణభయం ఉన్నదని రంజిత్‌ స్నేహితులం కావడం వల్లే మాపై ఇలాంటి అఘాయిత్యాలు చేస్తున్నాడని ఇది ముమ్మాటికి ఫ్యాక్షనిజమేనని పలువురు ఆపోతున్నారు. దగ్ధమైన ఇండ్లలో ఉన్న నగదు బట్టలు పత్తి ధాన్యం బియ్యం సర్వస్వం కోల్పోయామని బాధితులు వాపోతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు