Monday, September 9, 2024
spot_img

శ్వేతసౌధంలో కొకైన్‌

తప్పక చదవండి
  • అమెరికా వైట్‌ హౌజ్‌ వెస్ట్‌ వింగ్‌లో తెల్లటి ప్యాకెట్‌
  • ప్రాథమిక పరీక్షల్లో కొకైన్‌ మాదక ద్రవ్యంగా గుర్తింపు
  • ఆ సమయంలో వైట్‌ హౌజ్‌లో లేని జో బైడెన్‌
  • అధ్యక్ష భవనంలోకి ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో తెలుపు రంగు పొడి కలకలం సృష్టించింది. దానివల్ల భవనాన్ని కొంతసేపు అధికారులు ఖాళీ చేయించి, తనిఖీలు నిర్వహించారు. వైట్‌హౌజ్‌లోని పడమర దిక్కున సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లకు ఆ పౌడర్‌ దొరికింది. ఆ సమయంలో అధ్యక్షుడు జో బైడెన్‌ వైట్‌ హౌజ్‌ లో లేరు. సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు వెంటనే ఆ ప్రాంతాన్ని సీజ్‌ చేసి.. సదరు కాంప్లెక్స్‌లో ఉన్న వారిని మరో ప్రదేశానికి తరలించారు. ఆ పౌడర్‌ ను ఫైర్‌ అండ్‌ ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది పరీక్షించారు. ప్రాథమిక పరీక్షలో అది కొకైన్‌ అని తేలింది. దీన్ని నిర్ధారించేందుకు సదరు ప్యాకెట్‌ ను మరిన్ని పరీక్షల కోసం పంపించారు. అందులోనూ అది కొకైన్‌ అని తేలినట్టు తెలుస్తోంది. అంత పటిష్టమైన భద్రత ఉండే అధ్యక్ష భవనంలోకి ఆ పౌడర్‌ ఎలా వచ్చిందన్న దానిపై సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు దర్యాప్తు చేస్తున్నామని అధ్యక్ష భద్రతకు సంబంధించిన ఏజెన్సీ వెల్లడిరచింది. వైట్‌హౌజ్‌ వెస్ట్‌ వింగ్‌ అధ్యక్ష భవనానికి సమీపంలోనే ఉంటుంది. ఓవల్‌ కార్యాలయం, క్యాబినెట్‌ రూమ్‌, ప్రెస్‌ రూమ్‌, రాష్ట్రపతి సిబ్బంది కార్యాలయాలతో పాటు మరిన్ని కార్యాలయాలు ఈ వెస్ట్‌ వింగ్‌ కు సమీపంలోనే ఉంటాయి. ఇక్కడకు ప్రతీ రోజూ వందలాది మంది ప్రజలు వివిధ పనులు కోసం వస్తుంటారు. వారినందరిని క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతనే లోనికి రావటానికి అనుమతి ఇస్తారు. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్‌ హౌజ్‌ లోనికి కొకైన్‌ ప్యాకెట్‌ ఎలా వచ్చిందన్నది సంచలనంగా మారింది. ఏమైనా ? ఇది ఇక్కడికి ఎలా వచ్చిందనే విషయమై ఆరా తీస్తున్నామని సీక్రెట్‌ సర్వీస్‌ ప్రతినిధి ఆంథోనీ గుగ్గీల్మీ చెప్పారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ పదార్థాన్ని కనుగొన్నామని, ఎవరు, ఎందుకు దీనినిలా ఇక్కడ వదిలారో తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. అనుక్షణం సెక్యూరిటీ గార్డులతో కంచుకోటలా ఉండే శ్వేత సౌధంలో కొకైన్‌ కనబడడం ఆశ్చర్యకరమేనంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు