Wednesday, May 15, 2024

ఇస్రో శాస్త్రవేత్త లకి సలాం.

తప్పక చదవండి
  • న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి
  • విజయవంతంగా నింగిలోకి దూసుకెళిన చంద్రయాన్-3

చందమామ పైకి అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని శుక్రవారం చేపట్టి నేటి మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ సందర్బంగా ఇస్రో శాస్త్రవేత్త లకి న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి సలాం చేశారు. ఈ ప్రక్రియలో పాలుపంచుకున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్తో కూడిన చంద్రయాన్-3 యాత్రలో భాగంగా ఈ అత్యంత శక్తిమంతమైన రాకెట్ జాబిల్లి వద్దకు బయల్దేరి విజయవంతంగా కక్ష్య లొ పయనించడాన్ని భారత దేశం గర్వం తో చంద్రుని వంక చూస్తుంది అని కొనియాడారు. ఈ రాకెట్ చంద్రయాన్-3ని 24 రోజులు పుడమి చుట్టూ తిరుగుతుంది అని ఆతర్వాత క్రమంగా దీని కక్ష్యను పెంచుతూ చంద్రుడి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరుస్తారు అని తెలిపారు.పలు ప్రక్రియల అనంతరం అంతిమంగా చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి దీన్ని ప్రవేశపెడతారు అని ఆగస్టు 23 లేదా 24న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్తో కూడిన మాడ్యూల్ విడిపోయి.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగనుందని ఇస్రో వెల్లడించడాన్ని న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి అభినందించారు భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు