Saturday, July 27, 2024

ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ఇచ్చిన అనుమతులు రద్థు చేయాలి

తప్పక చదవండి
  • డిమాండ్ చేసిన అఖిలపక్ష కమిటీ నాయకులు..

ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే గట్టుప్పల పుట్టపాక మధ్యలో కాంతి ఫార్మా కంపెనీ కి ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని పుట్టపాక సర్పంచ్ అఖిలపక్ష కమిటీ నాయకులు సామల బాస్కర్ డిమాండ్ చేశారు. ఫార్మా కంపెని యాజమాన్యం తప్పుడు పత్రాలతో సమాచారంతో ప్రభుత్వాన్ని కోర్టును పక్కతోవ పట్టీస్తున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆసరా ఫౌండేషన్ చైర్మన్ బొల్ల శివశంకర్ మాట్లాడుతూ గౌరవమంత్రి వర్యులు కెటిఆర్ ముచ్చర్ల ఫార్మా సిటీలో స్థలం కేటాయిస్తామని చెప్పినా వినకుండా మొండి వైఖరి తో ప్రభుత్వానికి ప్రజలకు వ్యతిరేకంగా ఫార్మా కంపెనీ యాజమాన్యం ముందుకు పోవడాన్ని నిరసించారు. ఇప్పటికైనా వారి వైఖరి మార్చుకోకుంటే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. అఖిలపక్ష కమిటీ నాయకులు ఇడం కైలాసం మాట్లాడుతూ ప్రభుత్వం, మంత్రి వర్యులు కెటిఆర్ పై పూర్తి నమ్మకం ఉందని ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు. సిపిఎం,సిపిఐ పార్టీ జిల్లా నాయకులు చాపల మారయ్య, రమేష్ లు మాట్లాడుతూ అన్ని గ్రామాలలో ఫార్మా కంపెనీ కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సీనియర్ జర్నలిస్టు భీమగాని మహేష్ గౌడ్, పుట్టపాక ఎంపిటిసి సభ్యురాలు మర్రి వసంత, వెల్మకన్నె సర్పంచ్ వెంకట్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ఏసిరెడ్డి యాదవరెడ్డి, గజం హనుమంతు, చేనేత జాతీయ అవార్డు కొలను రవి, పిట్ట కృష్ణ, దేప ప్రవీణ్ రెడ్డి, బిజెపి నాయకులు కంపె దుర్గయ్య, టిడిపి నాయకులు అవ్వారు సుబ్బారావు, చిలువేరు జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు