Tuesday, May 21, 2024

సమరభేరీ పాలమూరు నుంచే..

తప్పక చదవండి
  • కేసీఆర్ అవినీతిపై పోరాటం ఆగేది లేదు..
  • లిక్కర్‌, అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్..
  • పాలమూరు ర్యాలీలో మండిపడ్డ కిషన్‌ రెడ్డి..
  • నియంత పాలన అంతమయ్యే వరకు నిద్రపోము : డీకే అరుణ..

బీజేపీ చేపట్టే ఏ పోరాటమైనా పాలమూరు నుంచే ఆరంభించటం ఆనవాయితీ అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి అన్నారు. ప్రజలను మోసం చేయటం కోసమే పార్టీ పెట్టారని.. సీఎం అయ్యారని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్‌ తెలంగాణగా, అప్పుల తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చారని మండిపడ్డారు. తెలంగాణలో మార్పు రావలసిన అవసరం ఉందన్నారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షాల విూద కేసులు పెడుతున్నారు.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలంటూ విరుచుకుపడ్డారు. మూడు పార్టీల డీఎన్‌ఏ ఒకటే.. ఈ మూడు పార్టీలు ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నాయని కిషన్‌ రెడ్డి అన్నారు.. సోమవారం జిల్లాలోని క్లాక్‌ టవర్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు నుంచే డబల్‌ బెడ్‌ రూం సమస్యలపై నిరసన ర్యాలీ చేపట్టామన్నారు. ప్రజల సొమ్ముతో కేసీఆర్‌ 10 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నారని వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుమ్ముక్కై పార్టీ కార్యాలయాలకు జాగాలిస్తారని.. కాని పాలమూరులో ఉన్న పేదలకు ఇళ్లు కట్టరని మండిపడ్డారు. 9 ఏళ్లలో ఇచ్చిన హావిూలను కేసీఆర్‌ విస్మరించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రేషన్‌ కార్డులే తప్ప కేసీఆర్‌ సర్కారుకు పేదలకు రేషన్‌ కార్డులిచ్చే సోయి లేదని విమర్శించారు. రాష్టాన్న్రి కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. దళితులకు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠంపై కూర్చున్న ఘనత కేసీఆర్‌ ది అని ఆయన అన్నారు.

9 ఏళ్లలో ఒక్క పోస్టుకూడా భర్తీ చేయలేదన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఆకలిమంటల్లో ఉన్నారని తెలిపారు. పేపర్‌ లీక్‌తో నిరుద్యోగులు ఆవేదనలో ఉన్నారన్నారు. ప్రజలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ ది.. రైతు రుణ మాఫీ ఎందుకు చేయలేదు.. అప్పులు కట్టలేక డిఫాల్టర్‌గా మారటం వల్ల రైతులకు అప్పు పుట్టటం లేదన్నారు. బంగారు తెలంగాణ దేవుడెరుగు, కానీ కేసీఆర్‌ కుటుంబం బంగారమైందన్నారు. తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది.. జిల్లాలోని బీజేపీ మహా ర్యాలీ నిర్వహించింది. అనంతరం క్లాక్‌ టవర్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి, తల్లోజు ఆచారీ, ఉమ్మడి జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ… తెలంగాణాలోని నియంత పాలన అంతం అయ్యే దాకా బీజేపీ నిద్రపోదన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఈ ప్రభుత్వం ఇచ్చేదాకా వదలమని.. లేదంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక తామే ఇస్తామని హావిూ ఇచ్చారు. మందిని మోసం చేసే విధానం సీఎం కేసీఆర్‌కు వచ్చినంతగా ఎవ్వరికీ సాధ్యం కాదన్నారు. సీఎం కేసీఆర్‌ సోయి తప్పి ఫార్మ్ హౌస్ లో పండుకున్నారని ఎద్దేవా చేశారు. టూబీహెచ్‌కే, రుణమాఫీ, ఉపాధి ఇలా ఎన్నో హావిూలు ఇచ్చారని.. ఏవైనా హావిూలు నెరవేర్చారా అని ప్రశ్నించారు. మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నారని… ఈ మోసగాని మాటలను ప్రతీ ఒక్కరికీ తెలిసేలా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. మన పేరున అప్పులు తెచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు జేబులు నింపుకున్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా.. మిగులు బ్జడెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారన్నారు. సీఎం కేసీఆర్‌లానే.. ఆ పార్టీ నేతలు కింది స్థాయి నాయకులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తున్నారని… ఇక్కడ అభివృద్ధి పేరున కవిూషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. జరిగిన అభివృద్ధి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగిందన్నారు. ఇక్కడ నడి వూరిలో ఉన్న కలెక్టరేట్‌ను కూల్చి.. ఆయన ఇంటికి దగ్గర్లో కట్టించుకున్నారన్నారు. హెరిటేజ్‌ బిల్డింగ్‌ను కూల్చి ఏం చేస్తున్నారో చెప్పాలని… జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డీకే అరుణ డిమాండ్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు