Wednesday, May 22, 2024

కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో సునామీలా రాబోతుంది.

తప్పక చదవండి
  • బిఆర్ఎస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం.
  • కాంగ్రెస్ అధికారులకు రాగానే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం.
  • సూర్యాపేట జిల్లా తిమ్మాపురం లో ఆటపాటలతో అలరించిన గద్దర్..
  • సీఎల్పీ నేత బట్టి విక్రమార్క..

సూర్యాపేట : బీఆర్ఎస్ కు వేసే ప్రతి ఓటు బీజేపీ కి వేసినట్లేనని, ఈ విషయాన్ని మైనారిటీ లో మదిలో పెట్టుకోవాలని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు.భారత్ జోడో యాత్ర లో భాగంగా బట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంగళవారం సూర్యాపేట జిల్లాలోని తిమ్మాపురం, చందుపట్ల (బి), నామవరం క్రాస్ రోడ్డు మీదగా మోతె మండలం కి చేరుకుంది.ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ.. లౌకిక పార్టీ కాంగ్రెస్ ఓటు వేస్తేనే బిజెపికి వ్యతిరేకంగా వేసినట్టు అవుతుందన్నారు. మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవడంతోనే బిజెపి, బిఆర్ఎస్ వేర్వేరు కాదని మరోసారి స్పష్టమైనదని వెల్లడించారు. పార్లమెంట్లో బిజెపి తీసుకువచ్చిన అనేక చట్టాలకు బిఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారని,భారత్ జూడో యాత్రకు భయపడి రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని మోడీ రద్దు చేయించారన్నారు.దురుద్దేశంతోనే రాహుల్ గాంధీని క్వార్టర్స్ ఖాళీ చేయించారని,కేంద్రం ఎలాంటి చట్టాలు తీసుకువచ్చినా మద్దతు తెలుపుతూ బిజెపితో బీఆర్ఎస్ కలిసి పని చేస్తుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయాలని కుట్రలో భాగమే బిజెపి బిఆర్ఎస్ రహస్య ఒప్పందం ప్రకారం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారని ఆరోపించారు.తెలంగాణలో 50% ఉన్న బీసీలకు కేసీఆర్ ప్రభుత్వం ఐదు శాతం నిధులు కేటాయించి గోర్లు, బర్లు, చేపలంటూ దగా చేస్తున్నదన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీలకు జనాభా దామాషా పద్ధతి ప్రకారం నిధులు కేటాయిస్తామని,బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం పేర్కొన్నారు.కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని,నియామకాలు లేకపోవడంతో యూనివర్సిటీలు నిరుద్యోగులకు కేంద్రాలుగా మారాయన్నారు.రైతులు, నిరుద్యోగులు, చేతివృత్తులు, కుల వృత్తుల వాళ్లు అందరూ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రైతుబంధు మాత్రమే ఇచ్చి, రైతుకు మిగిలిన అన్ని రకాల సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం తొలగించిందని గుర్తు చేశారు.రాష్ట్రంలో పండించిన ధాన్యమును కొనే దిక్కులేదు కాంట వేసిన ధాన్యానికి క్వింటాకు 12 కిలోల తరుగు ఇదేనా రైతు ప్రభుత్వం అని ప్రశ్నించారు.సూర్యాపేట ప్రజల స్పందన చూస్తుంటే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాయం అన్నారు. కాంగ్రెస్ అధికారులకు రాగానే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తాo అని,నిరుద్యోగులకు వార్షిక క్యాలెండర్ ప్రకటించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం అన్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి ఐదు లక్షల రూపాయలకు పెంచుతామని,ఇల్లు లేని బీదలకు డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తాం అన్నారు.భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు కూలి బందు ఇస్తాం అని,ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ప్రీమియం చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.ప్రజల సంపద ప్రజలకే చెందేలా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందాం అని,రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగురడం కాయం అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు