Thursday, May 2, 2024

కుటుంబ వ్యవస్థతోనే గౌరవం : దుర్గా వాహిని

తప్పక చదవండి
  • దక్షిణ అయోధ్య భద్రాచలంలో ఘనంగా “దుర్గావాహిని వికాస్ వర్గ”
  • వీరనారీమణుల చరిత్ర ఆధారంగా ముందడుగు
  • భద్రాచలం కేంద్రంగా వి.హెచ్. పి కార్యక్రమాలు సంతోషకరం

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైనదని.. కుటుంబ వ్యవస్థ బలపడితేనే మనుషులకు సమాజంలో గౌరవం పెరుగుతుందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్, దుర్గా వాహిని రాష్ట్ర ప్రముఖ్ వాణి సక్కుబాయి అన్నారు. భారతదేశం నాడి కుటుంబ వ్యవస్థలోనే దాగి ఉందన్నారు. భద్రాచలం శ్రీ రాములవారి సన్నిధిలోని అంబా సత్రంలో దుర్గా వాహిని సమావేశం నిర్వహించారు. భద్రాచలం పరిసర ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన యువతులు, బాలికలు శిబిరానికి హాజరయ్యారు. సంస్థాగతమైనటువంటి శిక్షణలో భాగంగా ఒకరోజు “దుర్గా వాహిని వికాస్ వర్గ” నిర్వహించారు. అధిక సంఖ్యలో హాజరైన మహిళలు, యువతులకు పలు అంశాలపై శిక్షణ అందించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఔన్నత్యాన్ని వక్తలు వివరించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు.. ఎదుర్కోవాల్సిన రీతుల గురించి అవగాహన కల్పించారు. మాత (తల్లి) యొక్క గొప్పతనాన్ని వైభవంగా వివరించారు. సోదరిగా.. భార్యగా.. తల్లిగా.. కుటుంబ యజమానిగా.. రకరకాల భారం మోస్తూ స్త్రీ కుటుంబానికి వెన్నెముకగా నిలుస్తుందన్నారు. కుటుంబ ఆత్మగౌరవం స్త్రీ నడవడికలోనే దాగి ఉంటుందని వారు చెప్పారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండి.. హిందూ జీవన విధానానికి కట్టుబడి ఉండాలన్నారు. పరిసర ప్రాంతాలు.. దైవ సన్నిధానంతో పాటు పలు రంగాలలో మన పాత్ర ఉండాలని జగదీశ్వర్, సక్కుబాయి వివరించారు. మన కుటుంబం, మన సంతానం అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. దైవభక్తి, దేశభక్తి గల సంతానాన్ని దైవం కూడా మెచ్చుకొని ఆశీర్వదిస్తుందని ఉదాహరించారు. రెండో అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం వైభవాన్ని విశ్వహిందూ పరిషత్ మరింత విస్తరించాలని విశ్వహిందూ పరిషత్ నేతలు పేర్కొన్నారు. పరిస్థితుల ప్రభావం కారణంగా ఎదురయ్యే సమస్యలను ధైర్య సాహసాలతో ఎదుర్కోవాలని చెప్పారు. చరిత్రలోని వీరనారీమణుల ఘట్టాలను వివరించారు. మానసిక వికాసానికి ఇలాంటి శిబిరాలు ఎంతో తోడ్పడతాయని శిబిరంలో పాల్గొన్న బాలికలు, యువతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ అర్చక పురోహిత్ ప్రాంత ప్రముఖ్ ఓరుగంటి సురేష్, వి.హెచ్. పి ఖమ్మం విభాగ్ కార్యదర్శి బాలాజీ, విభాగ్ మాతృ శక్తి ప్రముఖ్ శ్రీలక్ష్మి, విశ్వహిందూ పరిషత్ బద్రాద్రి జిల్లా కార్య అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు, సంఘటన కార్యదర్శి లక్ష్మయ్య, దుర్గా వాహిని జిల్లా సంయోజిక శ్రావణి, వి.హెచ్. పి భద్రాచలం నగర కార్యదర్శి సాయి, బూర్గంపాడు పూర్తి సమయ కార్యకర్త కళ్యాణి వివిధ ప్రాంతాల నుంచి హాజరైన దుర్గా వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు