Saturday, May 18, 2024

హైదరాబాద్‌ కిరాక్‌ షో

తప్పక చదవండి
  • కోచి కెడి’ఎస్‌పై గెలుపు
  • ప్రొ పంజా లీగ్‌ సీజన్‌-1

ప్రొ పంజా లీగ్ (ఆర్మ్‌ రెజ్లింగ్‌)లో కిరాక్ హైదరాబాద్‌ గొప్పగా పుంజుకుంది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో కోచి కెడి’ఎస్‌పై కిరాక్‌ హైదరాబాద్‌ కిరాక్‌ విజయాన్ని అందుకుంది. అండర్‌ కార్డ్‌లో ఏకపక్ష విజయాలు, మెయిన్‌ కార్డ్‌లో రెండింట మెరుపు ప్రదర్శనలు చేసిన కిరాక్‌ హైదరాబాద్‌ ఆర్మ్‌ రెజ్లర్లు 18-10తో తెలుగు రాష్రాల ఆర్మ్‌ రెజ్లింగ్‌ జట్టుకు లీగ్‌లో రెండో విజయాన్ని అందించారు. కోచి కెడి’ఎస్‌పై రాణించిన ఆర్మ్‌ రెజ్లర్లను కిరాక్‌ హైదరాబాద్‌ యజమానికి నెదురుమల్లి గౌతం రెడ్డి, సీఈవో త్రినాథ్‌ రెడ్డి అభినందించారు.

అండర్‌ కార్డ్‌లో తీన్‌మార్‌! :
అంతిమ ఫలితంతో సంబంధం లేకుండా అండర్‌ కార్డ్‌ మ్యాచుల్లో కిరాక్‌ హైదరాబాద్‌ జోరు కొనసాగుతోంది. కోచి కెడి’ఎస్‌పై అండర్‌ కార్డ్‌ మ్యాచుల్లో కిరాక్‌ హైదరాబాద్‌ తిరుగులేని విజయాలు సాధించింది. మూడు మ్యాచుల్లోనూ నెగ్గి 3-0తో నిలిచింది. తొలుత మెన్స్‌ 70 కెజీల విభాగంలో షాహిల్‌ హుస్సేన్‌ 1-0తో వైభవ్‌ బోరులెపై గెలుపొందగా.. మహిళల 65 కేజీల విభాగంలో మదుర కెఎన్‌ 1-0తో మెరుపు విజయం నమోదు చేసింది. చివరగా 90 కేజీల విభాగంలో రాహుల్‌ మహర్‌ సైతం 1-0తో శివను చిత్తు చేశాడు. అండర్‌ కార్డ్‌ మ్యాచులు ముగిసే సరికి కిరాక్‌ హైదరాబాద్‌ 3-0తో మంచి ఆధిక్యంలో నిలిచింది.

- Advertisement -

మెయిన్‌ కార్డ్‌లో మెరుపుల్‌ :
మెయిన్‌ కార్డ్‌ మ్యాచుల్లో కిరాక్‌ హదరాబాద్‌ సత్తా చాటింది. మెన్స్‌ 70 కేజీల విభాగంలో కిరాక్‌ హైదరాబాద్‌ ఆర్మ్‌ రెజ్లర్‌ స్టీవ్‌ థామస్‌ అదరగొట్టాడు. కోచి కెడి’ఎస్‌ ఆర్మ్‌ రెజ్లర్‌ ఆకాశ్‌ కుమార్‌పై ఉడుం పట్టుతో మెరిశాడు. 10-0తో గెలుపొంది కిరాక్‌ హైదరాబాద్‌ ఆధిక్యం భారీగా పెంచాడు. మెన్స్‌ 100 కేజీల విభాగంలో అహ్మద్‌ ఫైజల్‌ అలీ నిరాశపరిచాడు. డాన్‌ అబ్రహాం 10-0తో పైచేయి సాధించాడు. కోచి కెడి’ఎస్‌ను రేసులోకి తీసుకొచ్చాడు. అయినా, కిరాక్‌ హైదరాబాద్‌ 13-10తో ముందంజలోనే నిలిచింది. చివరగా మెన్నస్‌ 60 కేజీల విభాగం మ్యాచ్‌లో నవీన్‌ ఎంవీ అదుర్స్‌ అనిపించాడు. షౌకత్‌ విటీపై 5-0తో విజయం సాధించాడు. దీంతో కిరాక్‌ హైదరాబాద్‌ అలవోక విజయం సాధించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు