Friday, May 10, 2024

మరోసారి ఉగ్రరూపం దాల్చిన యమునా..

తప్పక చదవండి
  • అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం.. యమునా నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నది. ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది ప్రవాహం 205.75 మీటర్లకు చేరింది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హర్యానాలోని హత్నికుండ్‌ బరాజ్‌ నుంచి ప్రభుత్వం 2 లక్షలకుపైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దిగువన ఉన్న న్యూఢిల్లీకి మళ్లీ వరద పోటెత్తింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ముంపు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం వెల్లడించింది. కాగా, జూలై 25 వరకు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతవరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఢిల్లీకి మరింత వరద ముప్పు పొంచిఉన్నట్లయింది. అయితే గత కొన్నిరోజులుగా ఢిల్లీలో యమునా నది 205.33 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం నదీ ప్రవాహం ప్రమాద స్థాయికి తగ్గినప్పటికీ.. మళ్లీ పెరగడంతో అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల 13న యమునా నది 208.66 మీటర్లు ప్రవహించింది. అనంతరం క్రమంగా తగ్గుతూ వస్తున్నది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు