Thursday, May 16, 2024

హర్యాణాలో హై వే దిగ్భంధం..

తప్పక చదవండి

పొద్దుతిరుగుడు పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను క‌ల్పించాల‌ని కోరుతూ హ‌ర్యానాలో రైతులు ధ‌ర్నా చేప‌ట్టారు. కురుక్షేత్ర‌లోని జాతీయ ర‌హ‌దారి 44పై పిప్లీ వ‌ద్ద రోడ్డును బ్లాక్ చేశారు. పొద్దుతిరుగుడును ఎంఎస్పీ ధ‌ర‌కు ప్ర‌భుత్వం కొనుగోలు చేయ‌కుంటే అప్పుడు భారీ ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌డుతామ‌ని రైతులు వార్నింగ్ ఇచ్చారు.
హ‌ర్యానా, పంజాబ్‌, యూపీ రైతు నేత‌లు కురుక్షేత్ర‌లోని పిప్లీ వ్య‌వ‌సాయ మార్కెట్‌కు భారీగా త‌ర‌లివ‌చ్చారు. ఎంఎస్పీ దిలావో, కిసాన్ బ‌చావో నినాదంతో రైతులు ధ‌ర్నా నిర్వ‌హించారు. రెజ్ల‌ర్ భ‌జ‌రంగ్ పూనియా, రైతు నేత రాకేశ్ తికాయ‌త్‌లు రైతు మ‌హాపంచాయ‌త్‌కు హాజ‌ర‌య్యారు.

జాతీయ హైవేను బ్లాక్ చేసిన రైతుల్ని అరెస్టు చేశార‌ని, వారిని ప్ర‌భుత్వం రిలీజ్ చేయాల‌ని తికాయ‌త్ తెలిపారు. పంట‌కు ఎంఎస్పీ ఇవ్వాల‌ని, లేదంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ధ‌ర్నాలు ఉంటాయ‌న్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు