Tuesday, May 28, 2024

గురునానక్ ఇంజినీరింగ్ కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి..

తప్పక చదవండి
  • డిమాండ్ చేసిన డీ.వై.ఎఫ్.ఐ.
    ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ యూనివర్సిటీగా మార్చుకొని విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్న కాలేజ్ యజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టి చర్య తీసుకోవాలని డీ.వై.ఎఫ్.ఐ. డిమాండ్ చేసింది.. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎటువంటి గుర్తింపు లేకుండా యూనివర్సిటీ గా పేరు మార్చుకొని నడిపిస్తున్న గురునానక్ యజమానిపై చర్య తీసుకోవాలని డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు నాలుగు వేల మంది గత సంవత్సరం అడ్మిషన్ తీసుకొని ఇప్పటివరకు ఏ ఒక్క సెమిస్టర్ పరీక్ష నిర్వహించకపోవడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలో ఏర్పాటు చేయకముందే విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకొక పోవడంపై ప్రైవేట్ యూనివర్సిటీలలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని అర్థమవుతుందన్నారు. గురునానక్ కాలేజీని ప్రైవేట్ యూనివర్సిటీగా మార్చుకోవాలంటే ఎటువంటి నిబంధనలు ఉండాలో తెలియకుండా యూనివర్సిటీ పేరు చెప్పుకొని వేలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న గురునానక్ యజమానిపై క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది అన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు