- కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారైలు..
న్యూ ఢిల్లీ, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి అడుగడుగున ఘన స్వాగతం లభిస్తోంది. వైట్ హౌస్‌కి చేరుకున్న మోడీకి జోబైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరుదేశాధిపతులు భారత్, అమెరికా రక్షణ సహకారంపై ప్రధానంగా చర్చించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైట్‌హౌస్ సౌత్‌లాన్‌లో వేడుక సందర్బంగా ఎన్నారైలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పాస్ లు ఉన్నవారిని అనుమతించారు.
అమెరికా తెలుగు సంఘం సంఘం నాయకులు ప్రదీప్ కట్ట, విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్ తుమ్మల, రఘువీరారెడ్డి, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మధుకర్ రెడ్డి, సుధాకర్ గట్టు, తెలంగాణ డెవలపర్ ఫోరం మాజీ అధ్యక్షుడు మురళీ చింతలపాణి, ఓ.ఎఫ్. బీజేపీ మాజీ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, రాజేందర్ రావు, భీమా పెంట, ఆదిత్య రాయుడు, కె.ఎస్.ఎన్. రాజు, రామకృష్ణ, ప్రద్వీ వైట్‌హౌస్ సౌత్ లాన్‌లో వైట్‌హౌస్ వద్ద మోదీ పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొన్నారు.