Saturday, July 27, 2024

కోట్ల రూపాయల ప్రజాధనం వృధా..

తప్పక చదవండి
  • దుబ్బాక మున్సిపాలిటీలో వెలుగు చూసిన ఘటన..
  • ఆగమైన రామసముద్రం…
  • నిమ్మకు నీరెత్తినట్టుగా మున్సిపల్‌ పాలక వర్గం
  • సీఎం కేసీఆర్‌ కథలు రాసిన కట్టకు మోక్షం ఎన్నడు..?
  • చిల్డ్రన్‌ పార్క్‌, ఓపెన్‌ జిమ్‌ లు కాంట్రాక్టర్ల జేబులు నింపడానికేనా?
  • 2019లో దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది..
  • ఐదు సంవత్సరాలు గడుస్తున్నా చెక్కనిశిల్పంగా మారిన రామసముద్రం..
    దుబ్బాక : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలకోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం చెరువు ఆయకట్టలను అభివృద్ధి, వాటిని సుందరీకరణ చేసి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.. కానీ సిద్దిపేట జిల్లా, దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక మున్సిపాలిటీ దీనికి విభిన్నంగా మారింది.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పిన్నవయసులో అడుగులు వేసి, తన స్నేహితులతో కలిసి తిరిగిన రామసముద్రం కట్టపై.. ఆయన జ్ఞాపకాలు చిగురింపజేసేందుకు కన్నా కలలు కలలుగానే మిగిలాయి.. 2019లో ప్రారంభమైన చెరువు కట్టల సుందరీకరణలో భాగంగా సుమారు వందల కోట్లు జనం సొమ్ము వృధా అవ్వడం, ఆర్థిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. వివరాల్లోకి వెళితే.. రామసముద్రం కట్టపై ప్రధాన ద్వారాలు కొరకై, చెట్లు నాటడం, బాటసారులు, పర్యవేక్షకులు పర్యటించిందుకు వీలుగా ఫుట్‌ పాత్‌ ని పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, అంతే కాకుండా ఓపెన్‌ జిమ్‌ చిల్డ్రన్‌ పార్క్‌ వంటి ప్రజల వినియోగం కోసం ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే, ధ్వంసమై కుట్టిలను బడి చెత్తగా మారినా పట్టింపు లేకున్నా, అధికారులు కేవలం అలంకారప్రాయంగా మాత్రమే చూస్తున్న ప్రజా ప్రతినిధులు, రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్న విధంగా ప్రజా సొమ్ము దుర్వినియోగం చేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అసలు కట్టపై చెట్ల కంటే వెర్రిగా మొలిచిన గుంపే గుంపెయ్‌ మనకు దర్శనమిస్తోందని స్థానికులు అంటున్నారు.. త్వరగా ఈ సమస్యను పరిష్కరించి, కోట్ల రూపాయల జన సంపదను కాపాడాల్సిన అవసరం ఎంత్కెనా ఉందని.. రాజకీయ విశ్లేషకులు, ప్రజలు అంటున్నారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు