Wednesday, October 9, 2024
spot_img

ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలి..

తప్పక చదవండి
  • కలెక్టర్ కి ఫిర్యాదు..
  • రెవెన్యూ అధికారుల అండతోనే భూ కబ్జాలు చేస్తున్నారు..

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, గౌరిల్లి గ్రామ రెవిన్యూ సర్వే నెంబర్ : 182 లో ఎ:0.37 గుంటలు, సర్వే నెంబర్ : 195 లో ఎ:6.15 గుంటలు, సర్వే నెంబర్ : 206 లో ఎ:2.00 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జాచేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు అని బీఎస్పీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు గ్యార మల్లేష్, రంగా రెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ తిరుపతి రావుని కలిసి ఫిర్యాదు చేశారు.. ఈ సందర్భంగ్గ వారు మాట్లాడుతూ.. గౌరిల్లి గ్రామం సర్వే నం-182లో ఎ:0.37 గుంటల ప్రభుత్వ భూమిలో రంగ శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యులు కబ్జా చేసి రూములు నిర్మిస్తున్నారు అని, సర్వే నం-195 లో ఎ:6.15 గుంటల ప్రభుత్వ భూమిని అధికారులు పి.ఓ.టి.లో వేసి ఇంతకు ముందే సీజ్ చేసినారు. అట్టి భూమిలో లెక్కల విఠల్ రెడ్డి తండ్రి లేట్ నర్సింహ రెడ్డి, ఆ భూమికి ఉన్న గేట్ ను అక్రమంగా విరగ్గొట్టి గత 2 సంవత్సరాలు గా దున్నుకోవడం జరిగుతుంది. అట్టి భూమికి కోర్ట్ లో కేస్ కూడా నడుస్తుంది. కాబట్టి ఇట్టి ప్రభుత్వ భూమిని కాపాడి బోర్డ్ లు పెట్టి, అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది అని చెప్పారు. ఇదే గ్రామం సర్వే నం-206లో ఎ:1.00 గుంటలు గల జెడ్.పీ. రోడ్డుకు అనుకోని ఉన్న ప్రభుత్వ భూమిని ఎం.డి.అక్బర్ అలీ ఖాన్, జిల్లా కోఆప్షన్ సభ్యులు అక్రమంగా కబ్జా చేసి అనుభవిస్తున్నారు. కాబట్టి అట్టి ప్రభుత్వ భూమిని సర్వే చేసి బోర్డులు ఏర్పాటు చేసి, అతిక్రమించిన ఎం.డి అక్బర్ పైన చర్యలతో పాటు కేస్ లు నమోదు చెయ్యవలసిందిగా అడిషనల్ కలెక్టర్ కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది అని చెప్పారు.. ఇదే సర్వే నెంబర్ లో అక్రమంగా జెడ్పి రోడ్డుకు అనుకోని ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, సీసీ రోడ్డు వేస్తున్నారు.. ఆర్డీవో కి, ఎమ్మార్వో కి, కలెక్టర్ కి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని కూడా ఫిర్యాదు లో పేర్కొనడం జరిగింది.. ప్రభుత్వ భూములను కాపాడకపోతే బీ.ఎస్.పీ. పార్టీ తరుపున పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో చేస్తాం అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో.. అసెంబ్లీ కార్యదర్శి యంజాల ప్రహ్లాద్, అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి చిత్రం కృష్ణ, ఆదిభట్ల మున్సిపాలిటీ అధ్యక్షులు బంగారిగల్లా మహేందర్, చెంచల దన్ రాజ్, చెంచల చిరంజీవి పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు