Sunday, October 13, 2024
spot_img

టి.ఎస్.పీ. షూటింగ్ టీమ్ పతాక విజేతలకు అభినందనలు..

తప్పక చదవండి

హైదరాబాద్, 9 తెలంగాణ స్టేట్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ 2023-24లో పాల్గొన్న టి.ఎస్.పీ. షూటింగ్ టీమ్ పతక విజేతలను అభినందించడం ఎంతో సంతోషకరమైన విషయం.. 2023 జూన్ 14 నుండి 21 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి షూటింగ్ రేంజ్‌లో ఛాంపియన్‌షిప్ జరిగింది. పతక విజేతల వివరాలు ఇలా ఉన్నాయి : ఉన్నాయి..

ఎ. ప్రసన్న కుమార్, ఇన్‌స్పెక్టర్, ఐటీ అండ్ సీ, రాచకొండ.. 25 మీ. సెంటర్ ఫైర్ పిస్టల్‌లో బంగారు పతకం. 10 ఎమ్ ఎయిర్ పిస్టల్ లో కాంస్య పతకం.
బి. శంకర్, సీఐ, సీఎస్‌డబ్ల్యూ హైదరాబాద్.. 25 మీ. స్టాండర్డ్ పిస్టల్‌లో బంగారు పతకం. 25 మీ. సెంటర్ ఫైర్ పిస్టల్‌లో రజత పతకం.
జి. సైదులు, ఆర్‌ఐ, డీఏఆర్‌, జగిత్యాల.. 10ఎమ్ ఎయిర్ పిస్టల్ లో బంగారు పతకం.
కె. రాజ్ కుమార్, పీసీ 285 డీఏఆర్, కామారెడ్డి.. 50 మీ. ఓపెన్ సైట్ రైఫిల్‌లో బంగారు పతకం.
పి. శ్రీనివాస్, హెచ్‌సి 501, 13వ బిఎన్, టిఎస్‌ఎస్‌పి, మంచిర్యాల జిల్లా.. 25 మీ. స్టాండర్డ్ పిస్టల్‌లో రజత పతకం. 25 మీ. సెంటర్ ఫైర్ పిస్టల్‌లో కాంస్య పతకం.
బి. స్రవంతి, డబ్ల్యు.పీ.సి. 203, ఆసిఫాబాద్ జిల్లా.. 10 ఎం ఎయిర్ పిస్టల్‌లో రజత పతకం.
ఇ. రాజ్ కుమార్, పిసి 3111, 8వ బిఎన్, టిఎస్‌ఎస్‌పి, కొండాపూర్.. 50 మీ. 3 పీ.ఈవెంట్‌లో రజత పతకం.
సిహెచ్. మాధవి, డబ్ల్యు.పీ.సి. 2377, సి.ఏ.ఆర్. నిజామాబాద్.. 50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో రజత పతకం.

- Advertisement -

మరోసారి, తెలంగాణ రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ విజయాలు సాధించిన పతక విజేతలందరికీ అభినందనలు!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు