Sunday, October 6, 2024
spot_img

భరతావనిలో బాలల భవితకి పునాది బడియే కదా…

తప్పక చదవండి

మూడు నాలుగు దశాబ్దాల క్రితం వున్న సామాజిక ఆర్థిక పరిస్థితితులు భిన్నంగా వుండేవి మన స్వతంత్ర భరతావనిలో. అప్పుడప్పుడే బలహీన వర్గాల కుటుంబాలలో ఆర్థకంగా వెనకబాటుతనంమున్నప్పటికీ నాడు తల్లిదండ్రులు వారి కష్టసుఖాలను పక్కకు నెట్టి తమ పిల్లల చదువుకే ప్రాధాన్యత నిచ్చారు. ఆ తరం విద్యార్థులు నేడు అనేక ఉన్నతస్థాయి ఉద్యోగాలలో స్థిరపడి కీర్తిప్రతిష్ఠలు తెచ్చుకొని వారు వారి పిల్లలను ఉన్నతచదువులు చదివించుకొని దేశవిదేశాల్లో స్థిరపడేట్లు తమ జీవితాలను తీర్చి దిద్దుకున్నారు . దీని కంతటికి కారణం వారి నిస్వార్థ జీవిత ప్రస్థానం అని చెప్పవచ్చు. ఎనభైలలో దళితబహుజన కుటుంబాలలో వచ్చిన తిరుగుబాటు ఆలోచన పర్వం . రాజకియ సామాజిక మార్పులెన్నో వారిని ఆలోచింపజేసినయ్. ఒకవైపు పూటకి గడవకున్నా వారు తమ పిల్లలను ప్రభుత్వ బడికే పంపించారు. చాలాచోట్ల బడియీడు పిల్లలు పనులలో వుంటే బడికి పంపించే ఒత్తిడి అటు ప్రభుత్వం ఇటు సామాజిక స్వచ్చంద సంఘాలు ఫనిచేసేవి. ఇప్పటీ వరకున్న జాతీయ రాష్టస్థాయి విద్యాసంస్థలలో కూర్చబడిన పాఠ్యాంశాలు మనదేశంలోని అన్ని కులాలు మతాలకతీతంగా అందరికీ సమాన ఉచిత విద్యావకాశాలందేట్లు నాటి పాలకులందించారనటంలో సందేహం లేదు. శాస్త్ర సాంకేతికరంగాలలో విద్యార్థులు చదివిన చదువుకి సార్థకత తెచ్చిపెట్టుకొని భారతదేశపు మతసామరస్య ఔన్నత్యాన్ని దేశవిదేశాలకు చాటిచెప్పారు. చదువనేది కేవలం ఉద్యోగాలకోసమే కాకుండా మానవ జీవితాన్ని చీకటి నుండి వెలుగులోకి పయనింపచేసేదనవచ్చు. నాడు ఫూలే సావిత్రీబాయి లాంటివారి సామాజిక స్పూర్తి ఎంతగొప్పదో వర్ణించలేనిది. ఆ పై స్వాతంత్ర్యం వచ్చాక అంబేద్కర్ రాజ్యాంగం
పుణ్యమా అంటరానివారికి… వెలివేయబడ్డోళ్ళకీ …
కూలీనాలి చేసేటోళ్ళకీ పటేల్ పట్వరీలకింద పనిచేసే జీతగాళ్ళకీ చట్టం నెమ్మదినెమ్మదిగా వారికి చేరువయ్యి చదువు యొక్క గొప్పతనం చాటిచెప్పిందనడంలో సంధేహమేలేదు. విద్యార్థులు కలమతాలువేరైనా ఆచారసాంప్రదాయలు వేరైనా బడిలోకి వస్తే అన్నీ మరచి పోయి చదువు ఆటపాట లతోబాటు కలిసి భోజనం చేయటం మాయమర్మం యెరుగక కలియతిరిగేవారు నాటి విద్యార్థులు. వీటికి గల కారణాలు నాటి ఉపాధ్యాయులు చూపిన బోధించిన అభ్యుదయ భావజాలపు సామాజిక పాఠాలే అని గుర్తుకుంచుకోవాలి. బాలకార్మిక నిషేదం లాంటి చట్టాలనేకం నేటి జాతి ఔన్నత్యానికి వెలకట్టలేనిది. దీనికితోడు స్వచ్చంధ సంస్థల పాత్ర కూడా అనిర్వచనీయమే. నలభైయేండ్ల కింద జాతీయ రాష్ట్రస్థాయి లలో నిరక్షరాసులకు యువజనులకి రాత్రిపూట బడి ఎంతో దోహదపడిందనవచ్చు. కాబట్టే ఆ యువతరం జాతికి ఎంతో పునాదిరాళ్ళనివేసింది. బడికి దూరంగా వున్న పిల్లలని బడి హక్కునచేర్చుకొని వారికి రాచబాటలని వేసింది కూడా. చదువుకున్నవారెవ్వరూ పాడైపోలేదు ఏదోఒక రంగంలో స్థిరపడి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు . కేవలం మన దేశంలోనే ఇంకా తల్లిదండ్రుల ఆర్ధిక సామాజిక వెనకబాటుతనం వారి చిన్నారులను ఇంకా కూలీనాలీకో వివిధ సంస్థలలో పనులకి పంపించి జీవితాలను నెట్టుకొచ్చేవారూవున్నారు. మనదేశంలో అత్యంత వేగంగా నూటికి నూరుపాళ్ళు చదువుకున్న రాష్ట్రం కేరళ గా అందరికీ తెలిసిందే. మనరాష్ట్రం కూడా ఇంకా విద్యాపరంగా పురోగతి చెందాల్సివుంది. ప్రపంచంలోనే అత్యంత మానవీయ మరియు ఉన్నత ప్రమాణాలు కలిగి యున్నదేశం ఫీన్లాండ్ అని అనేక సర్వేలలో తేలిన మాట తీసేయలేంగదా. అక్కడి విద్య పౌరసమాజపు నీతి నిజాయితీ విలువలతోకూడినదిగా అంతర్జాతీయ సర్వేలు తేల్చాయి కూడా.

మనదేశంలో గత తొమ్మిది సంవత్సరాలుగా పాలకులు తీసుకువస్తున్న వివిధ విధ్యా విధానాలు రేపటి బాలల ఏ రకపు భవిష్యత్ పరిణామాలకో మనమే నిర్ణయించుకోవాలి. ఇప్పుడున్న వివిధ పాఠ్యపుస్తకాలు ఎంతో పరిణతి కల్గివుండి శాస్త్ర సాంకేతిక రంగాలవైపు ఆలోచించి విద్యార్దులు పరిశోధనాత్మకత వైపు వెళ్ళేట్లు ప్రోత్సహిస్తున్నాయి. కాని నూతన జాతీయ విద్యవిధానం లో భాగంగా ఇక జాతీయ స్థాయి సైన్స్ పుస్తకాలలో డార్విన్ పరిణామ సిద్దాంతం తీసివేసి వేరే అంశాలు విద్యార్థులకి బోధించే పాఠ్యాంశాలు చేర్చడమనేది నేటి తరం విధ్యార్థులు తిరోగమనం లోకి వెళ్ళే పరిణామం కాదా…వందల యేండ్లకిందనే కోపర్నికస్ మరియు గెలీలియో లాంటి శాస్త్ర జ్ఞులు నాటి పాలకుల ఎదురుతిరిగి చెప్పిన నిజాలెన్నో ప్రపంచ దేశాలలోని బడుల్లో పాఠ్యాంశాలుగా బోధించడంవల్లే కదా మానవాళి నాసా గానో ఇస్రో గానో విశ్వాన్ని శాసిస్తూ ముందుకు వెళుతున్నాం కదా. భవిష్యత్తరాలు ఎదుర్కొనే అనేక విపత్తులు వాటి దిశ దశ ని మానవుడే శాసించే దిశగా మన బడులు ఎదగాలి అంటే పాఠ్యాంశాలు అలా పురోగతికి పయనించాలి . కందుకూరి వీరేశలింగం మరియు ఉత్తరాన రాజారామ్మోహనరాయ్ లాంటివారు అందించిన స్పూర్తి భవిష్యత్తరంకి దక్కాలి. ఉపాధ్యాయులు స్వేచ్చగా పాఠాలు బోధించినప్పుడే చదువుకి విలువుంటుంది. గిరిగీసి పాఠాలు బోధిస్తే అది వికాసం కి దారితీయదు.. ఏదేశమైనా అత్యున్నత సంపద కలిగివుందంటే అదీ ఆదేశపు విధ్యా వ్యవస్థపైనే వుంటుంది. మనదేశంలో తల్లిదండ్రులు తమ పిల్లలను బడిలో చేర్పించి వారి భవిష్యత్తును వారే తీర్చిదిద్దుకునే అవకాశం కల్పించాలి. ప్రభుత్వాలు ఎంతో ఒడిదుడుకులతో గురుకులాలు సంక్షేమ బడులు కళాశాలలెన్నో ప్రారంభిస్తున్నప్పటికీ ఆయా పాఠశాలలో ఉపాధ్యాయ సిబ్బంది మరియు సహాయ సిబ్బంది సరిపోను నియమించుకోకుంటే కొత్త సీసాలో పాతపచ్చడి చంగానే వుంటుంది. కోట్లరూపాయలు ఖర్చ చేస్తున్నప్పటికి ఆ ఫలాలు దక్కేట్లు సరిగ్గా నియంత్రించకుండా తూతూ మంత్రగా వుంటే భావితరాలను అంధకారఃలో కో నెడుతున్నట్లే భావించాలి. తరతరాల బానిసత్వం నుంచి భరతావనిలో బాలబాలికలు స్వతంత్ర ఆలోచపరులుగా ఎదిగే మార్గాలు కల్పించే బాధ్యత ప్రభుత్వలదే..ఆ దిశలో తల్లిదండ్రులు పిల్లలను పయనింపజేయాలి. వారి వాకిళ్ళను వారే తెరవనివ్వాలి. అదే వారి భవిష్యత్తుకి పునాది చెప్పవచ్చు..బడిలో చేరిన విధ్యార్థులు మానసిక మరియు మానవ వికాసం వైపు అడుగులు వేయాలనే సత్సంకల్పంతో

- Advertisement -

తెలంగాణా బడులు పునప్రారంభం సంధర్భంగా..
యం.డి.రంజాన బేగ్
దేవరకొండ
9949552956.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు