Saturday, July 27, 2024

గడువు ముగిసినా…రోడ్డు వేయలేదు

తప్పక చదవండి
  • కోతకు గురవుతున్న దారి
    కోరుట్ల : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నుండి మల్లాపూర్‌ మండలంలోని నడికుట యామాపూర్‌ అనుసంధాన దానిపై బీట్‌ రహదారి మన పనులు అసంపూర్ణంగా మిగిలాయి. బీటీ దారి నిర్మాణానికి నిధులు విడుదలై శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించగా నిర్మాణం గడువు ముగిసినప్పటికీ పనులు పూర్తి కాలేదు దీంతో దారిలో ప్రయాణించే వాహనదారులకు ఇబ్బందికి గురవుతున్నారు.
    -రెండేళ్లు గడిచిన…నడికుడ వయా యామాపూర్‌ ఫకీర్‌ కొండాపూర్‌ వరకు నిర్మాణానికి ప్రధానమంత్రి సడక్‌ యోజన పథకం నిధులు రూ.3.83 కోట్లు మంజూరయ్యాయి. నిర్మాణ పనులకు 2021 జులై 6న శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. నిర్మాణం పనులను తగ్గించుకున్న గుత్తేదారి మొదట్లో విస్తరణ పనులు చేపట్టి కొంతమేరకు చేపట్టి కొంతమేరకు పూర్తి చేశారు .అనంతరం నిర్మాణం పనులు జప్యం చోటు చేసుకుంది. గుత్తిందారి నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించకపోవడంతో శంకుస్థాపన చేసి రెండు సంవత్సరాలు గడిచిన పనులు పూర్తి కాలేదు నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ ఏడాది ఫిబ్రవరి ముగిసింది.
    తోలగనున్న ఇబ్బందులు…ఫకీర్‌ కొండాపూర్‌, యామపూర్‌, తిమ్మాపూర్‌ , తిమ్మాపూర్‌ తండా ప్రజలు మండల కేంద్రానికి ప్రధాన రహదారి గుండా చేరుకోవాలని గోదూర్‌ మీదుగా 12 నుండి 15 కిలోమీటర్లు దూరం ప్రయాణించవలసి ఉంటుంది. కానీ ఈ రోడ్డు త్వరగా పూర్తయితే 6 కిలోమీటర్లు దూరం వరకు ప్రయాణిస్తే చాలు.
    వెంటనే పూర్తి చేయాలి
    బత్తుల శ్రీనివాస్‌ యామాపూర్‌
    ఈ దారి నిర్మాణ పనులు ప్రారంభించి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదు. వర్షం నీటితో చాలా చోట్ల దారి కోతకు గురైంది . వెంటనే నిర్మాణం పనులు చేపట్టి. రోడ్డును పూర్తి చేయాలి.
  • అనుమతులు రావాల్సి ఉంది
    గోపాల్‌ డిఈఈ పంచాయతీ రాజ్‌ శాఖ
    ఇబ్రహీంపట్నం, యమాపూర్‌ గ్రామాల మధ్య 1.5 కి మీ అడవి భూమి ఉంది అందులో తారు నిర్మాణానికి అనుమతులు రావాల్సి ఉంది. గుత్తిదారి నిర్లక్ష్యం తో బీటి దారి నిర్మాణం పనుల గడువు మూసింది. సదరు గుత్తిదారికి మన విధించి పనులను పూర్తి చేస్తాం.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు