Monday, May 6, 2024

గద్దరన్నకు నివాళి..

తప్పక చదవండి

అన్నా వేలవేల నిరుద్యోగులను ఉద్యమబాట పట్టించింది నీ పాట..
కరడుగట్టిన దోపిడీదారుల గుండెల్లో.. పిడుగుపాటు సృష్టించింది నీ మాట..
పల్లె, పట్నం, రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా నాదే అనే నీ పెద్ద మనసు..
ప్రతి సమస్యపై స్పందిస్తుంది.. ఆ క్షణమే సాహిత్య సృజన జరుగుతుంది..
ప్రజల హృదయాలను కరిగిస్తుంది.. నిన్ను అనుకరిస్తూ యువత కవిత రాస్తే..
జూనియర్ గద్దర్ అని పిలుస్తున్నారు.. అంతటి ప్రభావం నీ పాట ప్రవాహం..
గద్దారన్నా నీకు మరణం లేదు.. అన్యాయాన్నెదిరిస్తూ సాగే మా ‘రణం’ లో,
మా ఉద్యమంలో, చైతన్యదీపికవై ఉంటావు..
నీ పాట.. ప్రవహించే జలపాతం.. పరిమళించే పారిజాతం..
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం నీ కలం, గళం..
నేవ్వే లేవు.. ఏమిచ్చి తీర్చుకోగలదు.. తెలంగాణ నీ ఋణం..

  • ఎస్. సూర్యప్రకాశ్.. 9849488498..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు