- అస్తవ్యస్తంగా డ్రైనేజీ – రహదారిపైనే నిలిచిపోయిన వర్షపు నీరు
బోనకల్ : డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారడంతో వర్షపు నీరు పరహదారులపైనే నిలిచిపోయి కాలువలను తలపిస్తుంది. మండల కేంద్రంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి పక్కన ఉన్న ఆర్ అండ్ బి రహదారి కాలువను తలపిస్తుంది. శనివారం ఏకధాటిగా 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి ఫ్లైఓవర్ పక్కన ఆర్ అండ్ బి రోడ్డు జలమయమైంది.డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు అంతా రోడ్డుపైకి ప్రవహిస్తుంది. డ్రైనేజీ చెత్తాచెదారంతో పేరుకుపోవడంతో పొలాల్లో నుంచి వచ్చే వరద నీరు డ్రైనేజీలోకి పోకుండా రోడ్డుపైకి ఎక్కి భారీగా వరదబారుతూ కాలవను తలపిస్తూ వరదమయంతో సుమారు మోకాళ్ళ లోతు వరదతో రోడ్డు మునిగిపోయింది.

వాహనాల రాకపోకలకు, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. వర్షపు నీటి వల్ల వరదలో కొట్టుకు వచ్చే చెత్త , చెదారం తో పాటు విషకీటకాలు ఈ రోడ్డుపైకి రావడంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు అంటున్నారు.వర్షాకాలం వచ్చిందంటే బడ్డీ కొట్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు ఈ వరద వల్ల భయపడుతూ వ్యాపారం సాగిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఆర్ అండ్ బి డ్రైనేజ్ మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
- అస్తవ్యస్తంగా డ్రైనేజీ – రహదారిపైనే నిలిచిపోయిన వర్షపు నీరు