Wednesday, April 17, 2024

కుల వృత్తుల పునరుజ్జీవానికి ఆర్థిక చేయూత

తప్పక చదవండి

కుల వృత్తులకు పూర్వ వైభవం కల్పించాలనే లక్ష్యంగా సీఎం కేసీ ఆర్‌ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణలో కుల వృత్తుల పునరుజ్జీవానికి ఆయన ఆర్థిక చేయూత అందిం చడం పట్ల బిసి దళ్‌ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలనలో దశాబ్దాలుగా నిరా దరణకు గురైన కుల వృత్తులకు తెలంగాణ సర్కార్‌ చర్యలతో ఓ వెలుగు వెలుగుతున్నాయని అన్నారు. స్వరాష్ట్రంలో బిసి కుల స్తులు ఆర్థిక సావలంబ సాధించేలా కెసిఆర్‌ సర్కార్‌ బిసిల సంక్షే మానికి రూ 500 కోట్ల బడ్జెట్‌ కేటాయించడం శుభపరిణామం అన్నారు. దేశం చరిత్రలో ఎక్కడా లేని విధంగా గొల్ల కురుమలకు సబ్సిడీ లో గొర్రెల పంపిణీ, మత్సకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ వంటి ఎన్నో బృహత్తర సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం. తాజాగా మరో కొత్త పథకంతో కుల వుత్తులకు మరింత ఆదరణ తెచ్చే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుం దన్నారు. బిసిల ఆర్థిక స్వావలం బనకు అద్భుత అవకాశం బిసి కులవృత్తి దారులు, చేతి వృత్తిదా రులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు రూ.500 కోట్లు ఇంత పెద్ద మొత్తం కేటాయిం చడంతో నిరాధారణ తో నిరోషా నిస్పృహతో కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న కుల వృత్తులకు తిరిగి ప్రాణం పోసినట్టు అవుతుం దని అన్నారు. కుల వృత్తులపై ఆధారపడే కుటుంబాలు ఇక పై వలస కూలీలుగా మారకుండా ఉన్న ఊరిలోనే స్వశక్తితో గర్వంగా తలెత్తుకుని బతుకుతారని తెలి పారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ 300కోట్లను కేటాయించిన ప్రభుత్వం అద నంగా మరో రూ.200 కోట్లు కేటాయించింది అని గుర్తుచేశారు. మొత్తం నిధుల ను కూడా విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రూ.లక్ష ఆర్థిక సాయం బిసి కులవఅత్తిదారులు, చేతివుత్తి దారుల అభ్యున్నతికి ఎంతో దోహద పడుతుందన్నారు.
ఆర్థిక సహాయంతో యువతకు మేలు.. తెలంగాణలో సిఎం కేసీ ఆర్‌ నాయకత్వంలో కుల వుత్తులకు తగిన గుర్తింపు ఇస్తూ గౌర వాన్ని పెంచుతున్నారని చెప్పారు. కెసిఆర్‌ తీసుకుంటున్న చర్యల తో రాష్ట్రంలోని యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడ కుండా తమ కుల వృత్తులను ఆశ్రయిస్తున్నారు. స్వశక్తితో ఎదిగేం దుకు రూ లక్ష ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగప డుతుంద న్నారు. తాజాగా ప్రభుత్వం ఇస్తున్న రూ. లక్ష ఆర్థికసహాయం కుల వృత్తులు చేపట్టిన యువకులకు ఎంతోబాసటగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ బిసిల ఆర్థిక, సామా జిక అభ్యున్నతే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను, పథకాలను అమ లు చేస్తున్నదని కొనియాడారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా అనేక అవకాశాలను కల్పిస్తున్నారని స్పష్టం చేశారు. కులవృత్తులనే జీవ నోపాధిగా చేసుకుని బ్రతుకుతున్న గ్రామాల లోని యువ తకు రూ లక్ష ఆధిక సహాయం ఎంతగానో తోడ్పాటు ను అందిస్తు ంద న్నారు. యువతలో ఆత్వవిశ్వాసాన్ని పెంచుతుంద న్నారు. యువత తమలోని ప్రతిభకు పదును పెట్టి మరింత ఉన్నత స్థితికి చేరేందు కు ఇది ఒకసువర్ణ అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక చేయూతతో బిసియువత ఆర్థిక స్వావలంబన దిశగా అడు గులు పడతాయి అని విశ్వాసం వ్యక్తం చేశారు. యువత ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకుని సమా జంలో గర్వంగా జీవించాలని ఆకాం క్షించారు. కుల వుత్తులకు పూర్వ వైభ వం సిఎం కిసిఆర్‌ తీసుకుంటున్న నిర్ణ యాలతో తెలంగాణలో కుల వుత్తు లకు తిరిగి పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నాయని వెల్లడిం చారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాల కుల నిర్ణక్ష ధోరణితో కుల వృత్తులు కుటుంపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వృత్తుల మీద ఆధారపడ్డ వారు దుర్భర జీవి తాన్ని గడిపారని గుర్తు చేశారు. జీవనోపాధి కష్టమై పొట్ట చేతపట్టి వలస వెళ్లారన్నారు. కనుమరుగైన కుల వుత్తులకు బిఆర్‌ఎస్‌ ప్రభు త్వం జీవం పోస్తూ ఆర్థికాభివఅద్ధికి కృషి చేస్తుందన్నారు. కుల వుత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయం చేయాలనే ప్రభుత్వం నిర్ణయం హర్షణీయం అన్నారు. ఇది కుల వుత్తిదారు లకు ఎంతో లబ్ధి కలిగిస్తుందన్నారు. అంప శయ్యపై ఉన్నటువంటి కులవృత్తులకు కెసిఆర్‌ తిరిగి పునరుజ్జీవం కల్పించడం అభినం దనీయం అన్నారు. బిసిల అకాంక్షకు అనుగు ణంగా తెలంగాణ సర్కార్‌ నిర్ణయాలు తీసుకోవడం శుభపరిణా మం అన్నారు. కులవృత్తుల అభ్యున్నతికి కృషిచేస్తున్న కృషి వలుడు సిఎం కెసిఆర్‌కు యావత్‌ బిసిల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు