అమరావతి, మే 30 (ఆదాబ్ హైదరాబాద్):
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నదని బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన ప్రశాంత్ (తూర్పు విజయవాడ), వీ విష్ణు (ఉదయగిరి), పీ రమేష్, పీ పవన్ (కావలి), జీ సూర్యమోహన్, ఎం రాజేష్ (మైలవరం), బీ ఫిన్నీ లేజర్స్, పీ రామకృష్ణ(దర్శి) ఇతర కార్యకర్తలకు బీఆర్‌ఎస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఏపీలో యువతకు ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పక చదవండి
-Advertisement-